Ricky Ponting: IPL 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ పేలవ ప్రదర్శన తర్వాత జట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ (Ricky Ponting) విమర్శలకు గురయ్యాడు. శనివారం ఆయనను ఆ పదవి నుంచి తొలగించారు. ఈ సమాచారాన్ని ఫ్రాంచైజీ ట్వీట్ చేసింది. ఆస్ట్రేలియన్ లెజెండ్ గత ఏడేళ్లుగా జట్టులో భాగంగా ఉన్నాడు. ఫ్రాంచైజీలో సుదీర్ఘకాలం కొనసాగారు. పాంటింగ్ ఎన్నడూ జట్టును టైటిల్ గెలవలేకపోయాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 17వ ఎడిషన్‌లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌లో చోటు కోల్పోయింది.
ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ట్వీట్ చేసింది
రికీ పాంటింగ్‌ను చీఫ్ కోచ్ పదవి నుంచి తొలగించిన విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. “7 సీజన్ల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ రికీ పాంటింగ్‌తో విడిపోవాలని నిర్ణయించుకుంది. ఇది ఒక గొప్ప ప్రయాణం. కోచ్! మీరందించిన సేవలకు ధన్యవాదాలు” అని ఫ్రాంచైజీ రాసుకొచ్చింది. అయితే పాంటింగ్ కోచింగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవటంతో పాంటింగ్‌పై వేటు తప్పలేదని తెలుస్తోంది.
Also Read: Morne Morkel: టీమిండియా బౌలింగ్ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ ఆటగాడు..? బీసీసీఐదే నిర్ణయం..!
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ పాంటింగ్‌కు ఢిల్లీతో చాలా ఏళ్ల అనుబంధం ఉంది. పాంటింగ్ 2018 నుండి ఇప్పటివరకు నిరంతరం ఢిల్లీతోనే కలిసి పనిచేశారు. పాంటింగ్ కోచింగ్‌లో చాలా మంది ఢిల్లీ యువ ఆటగాళ్ల ఆట మెరుగుపడింది. అతని కోచింగ్‌లో ఢిల్లీ 2022లో ఫైనల్స్‌కు వెళ్లింది. ఫైనల్లో ఢిల్లీని 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఓడించింది. ఐపీఎల్‌లో ఢిల్లీకి దక్కిన అత్యుత్తమ స్థానం అదొక్కటే.
We’re now on WhatsApp. Click to Join.
గంగూలీ కోచ్ పదవిని స్వీకరిస్తారా?
రికీ పాంటింగ్‌ను ఆ పదవి నుంచి తొలగించిన తర్వాత ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రధాన కోచ్‌గా ఎవరిని నియమిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. సౌరవ్ గంగూలీకి ఈ బాధ్యతను అప్పగించవచ్చని నివేదికలలో పేర్కొన్నారు. పాంటింగ్ హయాంలో ఢిల్లీ క్యాపిటల్స్‌లో సలహాదారుగా వ్యవహరించిన భారత మాజీ కెప్టెన్ గంగూలీ, ఆస్ట్రేలియన్ కోచ్‌ను తొలగించిన తర్వాత ఖాళీ అయిన పదవిని చేపట్టే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఫ్రాంఛైజీ నుంచి ఎలాంటి సమాచారం లేదు.
