Site icon HashtagU Telugu

World Cup 2023 : ఇండియా వరల్డ్ కప్ కొడితే ..వైజాగ్ బీచ్ లో నగ్నంగా నడుస్తా – హీరోయిన్ ప్రకటన

Actress Rekha Boj Sensation

Actress Rekha Boj Sensation

ప్రస్తుతం ఎక్కడ చూసిన వరల్డ్ కప్ (World Cup 2023) మేనియా నడుస్తుంది. సొంతగడ్డ ఫై టీమ్ ఇండియా (India) అపజేయం లేకుండా వరుస విజయాలతో దూసుకెళ్తుంది. ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడి..తొమ్మిదిట్లో విజయం సాధించింది. ఈరోజు న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్స్ (New Zealand vs India) మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా గెలవాలని దేశ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే క్రమంలో టీమ్ ఇండియా వరల్డ్ కప్ కొడితే..నగ్నంగా బీచ్ లో నడుస్తానంటూ తెలుగు హీరోయిన్ ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యంలో పడేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా..? నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉండే రేఖా బోజ్ (Rekha Boj) ఈ ప్రకటన చేసింది. మాంగల్యం, స్వాతి చినుకు సంధ్య వేళలో, రంగీలా, కలయా తస్మై నమా: అనే చిత్రాల్లో అమ్మడు హీరోయిన్ గా నటించినప్పటికీ.. ఇవేవీ తనకు గుర్తింపు తీసుకురాలేదు. టాలీవుడ్‌ లో ఎన్నో సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా ఫలితం మాత్రం దక్కలేదు. దీంతో సోషల్ మీడియా ను నమ్ముకొని వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో హైలైట్ అవుతూ వస్తుంది. అయితే ఈరోజు సెమీస్ గెలిచి ఇండియా వరల్డ్ కప్ కొడితే.. వైజాగ్ బీచ్ లో నగ్నంగా నడుస్తా అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేసి వార్తల్లో నిలిచింది.

ప్రస్తుతం ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఈ పోస్టుకు నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ పెడుతున్నారు. అవసరం అంటావా ఇలాంటి వాటికి కమిట్ అవ్వకండి అంటూ సలహాలు కొందరు ఇస్తుంటే గెలిచేది మనమే కానీ ఇప్పుడు వెంటనే వైజాగ్ రావాలంటే కష్టం కదా అని కామెంట్ చేస్తున్నారు. ఇక ఫేమస్ అయ్యేందుకు ఇలా డ్రామాలు ఆడుతోందని మరికొంతమంది కామెంట్స్ వేస్తున్నారు.

Read Also : Pitch Swap For Semis: సెమీస్ ముంగిట బీసీసీఐపై సంచలన ఆరోపణలు.. పిచ్‌ను మార్చేశారంటూ కథనాలు..!?