Site icon HashtagU Telugu

Sanju Samson: శ్రీలంకతో వన్డే సిరీస్ సంజూను అందుకే ఎంపిక చేయలేదా ?

Sanju Samson

Sanju Samson

Sanju Samson: వచ్చే వారం శ్రీలంక పర్యటన కోసం భారత క్రికెట్ జట్టు సోమవారం బయలుదేరనుంది. ఈ టూర్ కు ఎంపిక చేసిన జట్టులో వికెట్ కీపర్ సంజూ శాంసన్ కు మరోసారి నిరాశే ఎదురైంది. సంజూను కేవలం టీ ట్వంటీలకు మాత్రమే ఎంపిక చేసిన సెలక్టర్లు వన్డేలకు మాత్రం తీసుకోలేదు. గతంలో చాలాసార్లు ఇలాగే అన్యాయానికి గురైన సంజూను ఈ సారి పక్కన పెట్టడానికి కొన్ని కారణాలున్నాయి. వన్డే జట్టులోకి కెఎల్ రాహుల్ తిరిగి రావడం ప్రధాన కారణంగా చెప్పొచ్చు. వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ తో పాటు కెఎల్ రాహుల్ కూడా కీపింగ్ బాధ్యతలకు సిద్ధంగా ఉంటాడు. దీంతో ఇద్దరు వికెట్ కీపర్లుగా ఉన్నప్పుడు మూడో కీపర్ అవసరం ఉండదనేది తేలిపోయింది.

టీ ట్వంటీల్లో రాహుల్ కు చోటు దక్కలేదు కాబట్టి సంజూ ఎంపికయ్యాడు. అయితే స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతుండడం కూడా సంజూకు మైనస్ గా మారింది. లంక పిచ్ లు స్పిన్ కు అనుకూలించడం, ఆ జట్టులో ఇద్దరు లెగ్ స్పిన్నర్లు మంచి ఫామ్ లో ఉండడంతో సంజూ శాంసన్ కు ప్రతికూలంగా మారింది. హసరంగా బౌలింగ్ లో ఆరుసార్లు ఔటైన సంజూ స్పిన్ ను ఎదుర్కొనేందుకు తన టెక్నిక్ ను మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. ఈ కారణాలతోనే సెలక్టర్లు వన్డే జట్టులోకి సంజూ శాంసన్ ను తీసుకోలేదు. ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు 2027 వరల్డ్ కప్ టీమ్ లోనూ పంత్ , రాహుల్ కే మొదటి ప్రాధాన్యత ఉంటుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఏ స్థానంలో దింపినా దూకుడుగా ఆడే స్వభావం పంత్ కు మొదటి అడ్వాంటేజ్. ఇక కెఎల్ రాహుల్ కూడా టాపార్డర్ లో నిలకడగా రాణించే రికార్డుంది. 2015లోనే టీ ట్వంటీల్లో అడుగుపెట్టిన సంజూ శాంసన్ వన్డేల్లో అరంగేట్రం చేయడానికి మాత్రం ఆరేళ్ళు పట్టింది. 2021లో వన్డే కెరీర్ ఆరంభించిన సంజూ ఇప్పటి వరకూ 16 వన్డేల్లో 510 పరుగులు చేశాడు. దీనిలో 1 సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Also Read: Thammudu : పవన్ కళ్యాణ్ ను గట్టిగా వాడేసుకుంటున్న నితిన్..!!