Site icon HashtagU Telugu

Virat Kohli: 18 ఏళ్ల నిరీక్షణకు ఇది ఫలితం.. ట్రోఫీ గెలిచిన త‌ర్వాత కోహ్లీ తొలి పోస్ట్‌

Virat Kohli (1)

Virat Kohli (1)

Virat Kohli: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన రోమాంచక ఐపీఎల్ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తన చిరకాల కలను నెరవేర్చుకుంది. పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టును ఓడించి ఐపీఎల్ ట్రోఫీని తొలిసారిగా గెలుచుకున్న ఆర్సీబీ, 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. మూడుసార్లు ఫైనల్‌ చేరినా విజయాన్ని అందుకోలేకపోయిన ఆర్సీబీ, ఈసారి మాత్రం పట్టుదలతో ఆడి చరిత్ర సృష్టించింది.

మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 190 పరుగుల మంచి స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ (43), రజత్ పాటిదార్ (26), జితేశ్ శర్మ (24) లు కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టుకు పటిష్ట స్థితిని అందించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ బ్యాటర్లను ఆర్సీబీ బౌలర్లు గట్టిగా కట్టడి చేసి విజయం ఖరారు చేశారు.

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ ఫైనల్ మ్యాచ్ దాదాపు లక్ష మంది ప్రేక్షకుల సమక్షంలో ఘనంగా సాగింది. జట్టు విజయంతో ఆటగాళ్లు, అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. ప్రత్యేకంగా విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ, “ఈ జట్టు కలను సాకారం చేసింది. 18 ఏళ్ల నిరీక్షణకు ఇది ఫలితం. ఐపీఎల్ ట్రోఫీ ముద్దాడటం కోసం ఈ ప్రయాణం ఎంతో విలువైనది” అంటూ భావోద్వేగంగా స్పందించాడు. తన పోస్టుతో పాటు ట్రోఫీతో కూడిన సెలబ్రేషన్ ఫోటోను కూడా షేర్ చేశాడు.

ఈ విజయంతో ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న ఎనిమిదో జట్టుగా ఆర్సీబీ చరిత్రలో నిలిచింది. ఎన్నో సీజన్లుగా నిరీక్షణలో ఉన్న అభిమానులకు ఈ గెలుపు మధురానుభూతిని మిగిల్చింది. ఇకపై ఆర్సీబీ పేరు మాత్రమే కాదు… ట్రోఫీ కూడా వారి గర్వంగా నిలిచే చిహ్నంగా మారింది.

Morgan Stanley: 2030 నాటికి భారత్‌లో క్విక్ కామర్స్ మార్కెట్ $57 బిలియన్లకు చేరనుంది

Exit mobile version