Virat Kohli Captaincy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ అంటే IPL 2025 ఈ ఏడాది మార్చి నెల నుండి ప్రారంభమవుతుంది. IPL 2025కి ముందు మొత్తం 10 జట్లు తమ తమ జట్లను సిద్ధం చేశాయి. అయితే ఐపీఎల్ కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికీ చాలా జట్లు తమ కెప్టెన్లను ఎంపిక చేయలేదు. ఈ జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా చేరింది. ఈసారి విరాట్ కోహ్లీ ఆర్‌సీబీకి కెప్టెన్‌గా (Virat Kohli Captaincy) వ్యవహరిస్తాడని ప్రచారం జరిగింది. అయితే కెప్టెన్సీ విషయంలో ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాకుండా విరాట్ అభిమానులకు షాక్ ఇచ్చాడు.
RCB ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. RCB కెప్టెన్‌కు సంబంధించి ప్రతి ఒక్కరూ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మేము కొత్త సీజన్‌లోకి వెళ్తున్నాము. రాబోయే 3 సంవత్సరాలు ఎలా ఉంటుందనేది ఇప్పటి నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. మీరు నన్ను ఎలాంటి ప్రశ్నలు అయినా అడగవచ్చు. కెప్టెన్సీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నది నిజం. అయితే విరాట్ కోహ్లి కెప్టెన్ అవుతాడా? లేదా అనేది ఇప్పుడే చెప్పలేనని ఆండీ ఫ్లవర్ స్పష్టం చేశాడు. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు.
Also Read: HMPV: భారతదేశంలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి .. తాజాగా 10 నెలల చిన్నారికి వైరస్!
వేలంలో ఆశ్చర్యపరిచిన ఆర్సీబీ
IPL 2025 కోసం వేలం 25-26 నవంబర్ 2024లో జరిగింది. అక్కడ అన్ని జట్లు తమ తమ బృందాలను సిద్ధం చేశాయి. కాగా RCB తన నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యపరిచింది. కెప్టెన్సీ కోసం కేఎల్ రాహుల్‌ను జట్టులో చేర్చుకుంటారని అంతా భావించారు. కానీ కేఎల్ రాహుల్‌పై ఎలాంటి బిడ్ వేయలేదు. RCB తన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని లేదా మరొక ఆటగాడ్ని ఎంపిక చేస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఐపీఎల్ 2025కు ఆర్సీబీ పూర్తి జట్టు
- విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, యష్ దయాల్, లియామ్ లివింగ్‌స్టోన్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, రసిఖ్ దార్, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, నువాన్ తుషార, మనోజ్ భాండాగే, జాకబ్ బెతెల్ , దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ ఛికార, లుంగి ఎన్గిడి, అభినందన్ సింగ్, మోహిత్ రాతి.