RCB vs DC: ఐపీయల్ సీజన్ 16లో భాగంగా ఈ రోజు చిన్న స్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. టాస్ ఓడి బ్యాటింగ్ బరిలోకి దిగిన బెంగుళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో కోహ్లీ మరోసారి చెలరేగాడు 34 బంతుల్లో 50 పరుగులతో ఆకట్టుకున్నాడు. డు ప్లెసిస్ 22 పరుగులు చేయగా.. మ్యాక్స్ వెల్ 24 పరుగులు, లామ్రోర్ 26 పరుగులతో సరిపెట్టుకున్నారు. ఈ ఇన్నింగ్స్ లో కోహ్లీ తప్ప మిగతా ప్లేయర్స్ ఎవరూ విధ్వంసకర బ్యాటింగ్ చేయలేదు. నిజానికి చిన్న స్వామి గ్రౌండ్ బెంగుళూర్ కు ఫెవరెట్ గా నిలుస్తూ వస్తుంది. ప్రతిసారి విరుచుకుపడే బెంగుళూరు ఆటగాళ్లు ఈ రోజు కాస్త తడబడ్డారు. బెంగుళూరు నిర్ధేశించిన 175 స్కోర్ ను ఢిల్లీ బీట్ చేస్తుందో లేదో చూడాలి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు : విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (సి), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (w), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: డేవిడ్ వార్నర్ (సి), మిచెల్ మార్ష్, యశ్ ధుల్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, అభిషేక్ పోరెల్ (w), కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే, ముస్తాఫిజుర్ రెహమాన్
Read More: IPL 2023 Points Table: టాప్ ప్లేస్ లో లక్నో సూపర్ జెయింట్స్