RCB For Sale: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ అయిన ఐపీఎల్ 2025 విజేత జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB For Sale) అమ్మకానికి ఉంది. ప్రస్తుతం ఆర్సీబీ జట్టు యజమాని మెక్‌డౌవెల్స్ విస్కీ తయారీ సంస్థ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ఆర్సీబీని అమ్మడానికి సన్నాహాలు చేస్తోంది. ఒకవేళ ఆర్సీబీ జట్టును అమ్మితే ఇది ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద ఒప్పందం అవుతుంది. ఎందుకంటే ఆర్సీబీ యజమాని జట్టును అమ్మడానికి భారీ ధరను నిర్ణయించారు.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ సంస్థ 2 బిలియన్ డాలర్లు అంటే సుమారు 17,000 కోట్ల రూపాయలతో ఆర్సీబీని అమ్మాలని నిర్ణయించింది. గతంలో యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ విజయ్ మాల్యాది. కానీ మాల్యా దివాలా తీసిన తర్వాత ఈ సంస్థను బ్రిటిష్ కంపెనీ డయాజియో కొనుగోలు చేసింది. ఇప్పుడు డయాజియోనే ఆర్సీబీ యజమాని.
Also Read: ICC T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్!
2008లో ఆర్సీబీ ధర ఎంతంటే?
పలు నివేదికల ప్రకారం.. ఐపీఎల్ ప్రారంభమైన 2008లో ఆర్సీబీ ధర 111.6 మిలియన్ డాలర్లు అంటే సుమారు 476 కోట్ల రూపాయలు. అప్పట్లో ఆర్సీబీ ఐపీఎల్‌లో రెండవ అత్యంత ఖరీదైన జట్టుగా ఉంది. విజయ్ మాల్యా తన సంస్థ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్‌కు ఆర్సీబీ యాజమాన్య హక్కులను ఇచ్చాడు. 2014లో బ్రిటిష్ కంపెనీ డయాజియో యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్‌లో పెద్ద వాటాను కొనుగోలు చేసింది. 2016లో సంస్థ పూర్తిగా ఆర్సీబీని కొనుగోలు చేసింది.
ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద ఒప్పందం కానుంది?
ఒకవేళ ఆర్సీబీ జట్టు 17,000 కోట్ల రూపాయలకు అమ్మబడితే ఇది ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద ఒప్పందం అవుతుంది. ఇంతకు ముందు ఏ జట్టు ఇంత పెద్ద ధరకు అమ్మకానికి పోలేదు. ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు వచ్చినప్పుడు లక్నో సూపర్ జెయింట్స్‌ను RPSG గ్రూప్ 7,090 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అలాగే CVC క్యాపిటల్ 5,625 కోట్ల రూపాయలకు గుజరాత్ టైటాన్స్‌ను కొనుగోలు చేసింది.