Site icon HashtagU Telugu

Ambati Rayudu : ఇప్పటికి రాయుడు ఆ సూట్‌కేస్‌ను ఓపెన్ చేయలేదు – అంబటి రాయుడి భార్య

Rayudu 2019

Rayudu 2019

2019 వన్డే వరల్డ్ కప్‌ (2019 ODI World Cup) జట్టులో చోటు దక్కకపోవడం అంబటి రాయుడి(Ambati Rayudu)కి జీవితాంతం మర్చిపోలేని విషాదంగా మారింది. భారత జట్టులో నాలుగో స్థానానికి అత్యుత్తమమైన ఆటగాడు అనిపించినప్పటికీ, చివరి నిమిషంలో అతన్ని పక్కన పెట్టి విజయ్ శంకర్‌ను ఎంపిక చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో విరాట్ కోహ్లి సైతం రాయుడే ఆ స్థానానికి సరైన వ్యక్తి అని వ్యాఖ్యానించినా, సెలక్టర్ల నిర్ణయం అతనికి నిరాశను మిగిల్చింది. తీవ్ర మనోవేదనలో ఉన్న రాయుడు, తన భాధను వ్యంగ్యంగా వ్యక్తీకరిస్తూ ‘త్రీడీ కళ్లద్దాలు’ ట్వీట్ చేసి క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు.

Electricity sector : కరెంట్‌ కొరత లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని తయారు చేశాం: సీఎం చంద్రబాబు

తాజాగా అంబటి రాయుడి భార్య విద్య (Ambati Rayudu’s wife Vidya)వెల్లడించిన విషయాలు మరింత భావోద్వేగాన్ని కలిగిస్తున్నాయి. వరల్డ్ కప్‌ టూర్‌ కోసం బీసీసీఐ పంపిన కిట్ బ్యాగ్, సూట్ కేస్‌ను ఇప్పటికీ తెరవలేదని చెప్పుకొచ్చింది. వరల్డ్ కప్‌ ఆడటం ఖాయం అనే ఆశతో ఉన్న రాయుడి కుటుంబం, చివరి నిమిషంలో వచ్చిన షాక్‌ను జీర్ణించుకోలేకపోయిందని పేర్కొంది. అంతకు ముందు జరిగిన న్యూజిలాండ్ సిరీస్‌లో రాయుడు అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ, అతనిని ఎందుకు జట్టులోకి ఎంపిక చేయలేదో స్పష్టత లేదని తెలిపారు. ఒక ఆటగాడి కష్టాన్ని అర్థం చేసుకోకుండా, సరైన వివరణ లేకుండా తీసుకున్న నిర్ణయం అతనికి ఎంతో నష్టాన్ని మిగిల్చిందన్నారు.

Telangana Assembly : స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెడతాం: బీఆర్‌ఎస్

అటు అంబటి రాయుడు మిత్రులు, అభిమానులు కూడా అతనికి మద్దతుగా నిలిచారు. 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోవడం అందరికీ నిరాశ కలిగించింది. ఆ మ్యాచ్‌లో రాయుడు ఆడివుంటే, భారత్ విజయవంతమయ్యేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే తనను జట్టులోకి ఎంపిక చేయకపోవడానికి అప్పటి చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాత్రమే కారణం కాదని రాయుడు స్వయంగా వెల్లడించారు. విరాట్ కోహ్లి తనకు ఎప్పుడూ అండగా నిలిచాడని, అతని వల్లనే తాను జట్టులోకి రాలేదనే వాదన అసత్యమని స్పష్టం చేశారు. అయినప్పటికీ, తన ఆట జీవితంలో ఇది ఎన్నటికీ మరిచిపోలేని సంఘటనగా నిలిచిపోతుందని అంబటి రాయుడు పేర్కొన్నారు.