Site icon HashtagU Telugu

CSK vs KKR: చెన్నై చెపాక్ లో జడేజా స్పిన్ మాయాజాలం

CSK vs KKR

CSK vs KKR

CSK vs KKR: చెన్నై చెపాక్ మైదానంలో రవీంద్ర జడేజా మ్యాజిక్ చేశాడు. తన స్పిన్ మాయాజాలంతో కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్ ని నేలకూల్చాడు. కేకేఆర్ లాంటి బలమైన జట్టుపై మూడు వికెట్లను కుప్పకూల్చి సత్తా చాటాడు. సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీలను జడేజా ఒకే ఓవర్‌లో పెవిలియన్ చేర్చాడు. కాగా నాలుగు ఓవర్లలో 18 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు శుభారంభం దక్కలేదు. తుషార్ దేశ్‌పాండే ఖాతా తెరవకుండానే తొలి బంతికే పెవిలియన్‌కు చేరాడు. ఆరంభంలోనే తొలి వికెట్ పడటంతో కైకేయ పై ఒత్తిడి పెరిగింది. ఈ పరిస్థితుల్లో అంగ్క్రిష్ రఘువంశీ మరియు సునీల్ నరైన్ జట్టు బాధ్యతలు తీసుకుని స్కోరును ముందుకు నడిపించారు. నరైన్, రఘువంశీ జోడీని బ్రేక్ చేసేందుకు కెప్టెన్ రుతురాజ్ బంతిని రవీంద్ర జడేజాకు అందించాడు. దీంతో అంగ్క్రిష్ రఘువంశీ ఇన్నింగ్స్‌కి జిడ్డు ఫుల్ స్టాప్ పెట్టాడు. అదే ఓవర్లో నరైన్ ఇన్నింగ్స్‌ను కూడా ముగించాడు . 20 బంతుల్లో 27 పరుగులు చేసి నరైన్ పెవిలియన్ చేరడంతో కేకేఆర్ భారీ స్కోరుకు బ్రేక్ పడింది. ఇక తుషార్ దేశ్‌పాండే కూడా మూడు వికెట్లు తీసుకున్నాడు. 4 ఓవర్లు వేసిన తుషార్ దేశ్‌పాండే 33 పరుగులిచ్చి 3 వికెట్లతో సత్తా చాటాడు. ముస్తాఫిజుర్ రెహమాన్ 2 వికెట్లు, మహేశ్ తీక్షణ 1 వికెట్ తో కేకేఆర్ ని దెబ్బ తీశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో కోల్కతా నైట్ రైడర్స్ 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది.

We’re now on WhatsAppClick to Join

సీఎస్‌కే జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.

కేకేఆర్ జట్టు: ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.

Also Read: Pothina Mahesh : వైసీపీ లోకి పోతిన మహేష్..? టెన్షన్ లో కూటమి..!!

Exit mobile version