Rashid Khan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ముందు ఆటగాళ్లు అద్భుత ఫామ్ లో కనిపిస్తున్నారు. పలు లీగ్ లలో తమ సత్తా చాటుతున్నారు. బౌలర్లు వికెట్ల వేట కొనసాగిస్తుండగా, బ్యాటర్లు శతకాలతో మెరుస్తున్నారు. దీంతో ఫ్రాంచైజీ ఓనర్లు ఆటగాళ్ల ప్రదర్శనని చూసి మురిసిపోతున్నారు. గుజరాత్ టైటాన్స్ స్టార్ ఆల్ రౌండర్ ఆటగాడు, ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (Rashid Khan) ఒకే టెస్ట్ మ్యాచ్ లో 10 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు.
జింబాబ్వే, ఆఫ్ఘానిస్తాన్ మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో రషీద్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బులవాయో వేదికగా జింబాబ్వే, ఆఫ్ఘనిస్థాన్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో రషీద్ 27.3 ఓవర్లలో 94 పరుగులు ఇచ్చి 4 వికెట్లు సాధించాడు. ఫలితంగా జింబాబ్వే మొదటి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు కుప్పకూలింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్ 6 వికెట్లు పడగొట్టాడు. ఈ విధంగా ఈ మ్యాచ్‌లో మొత్తం 10 వికెట్లు తీశాడు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి జింబాబ్వే 8 వికెట్లకు 205 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే జింబాబ్వే ఇంకా 73 పరుగులు చేయాల్సి ఉంది. అయితే ఆఫ్ఘనిస్థాన్‌కు 2 వికెట్లు కావాలి. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ ఇంకా 12 వికెట్లు తీసే అవకాశం ఉంది.
Also Read: Sama Ram Mohan Reddy : సిగ్గుందా సైకో రామ్..? – సామ రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్ 2025కి ముందు గుజరాత్ టైటాన్స్ రషీద్ ఖాన్‌ను అట్టిపెట్టుకుంది. రషీద్ అద్భుతమైన స్పిన్నర్ , బ్యాటింగ్ లోనూ పరుగులు సాధించగలడు. బలమైన షాట్లతో ప్రత్యర్థి బౌలర్లను ఆశ్చర్యపరిచిన సందర్భాలున్నాయి. ఎంతటి బౌలర్నైనా ఎదుర్కొని సునాయాసంగా సిక్సర్లు బాదుతుంటాడు. ఐపీఎల్‌లో ఆల్‌రౌండర్‌గా చాలాసార్లు అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. అయితే ఐపీఎల్ 2025కు ముందు రషీద్ ఫామ్ లో ఉండటం గుజరాత్ కి కలిసొచ్చే అంశం. దీంతో జిటి యాజమాన్యం రషీద్ పై భారీ అంచనాలు పెట్టుకుంది.