Site icon HashtagU Telugu

Sydney Test: భార‌త్‌కు బ్యాడ్ న్యూస్‌? వ‌రల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌కు క‌ష్ట‌మేనా?

Sydney Test

Sydney Test

Sydney Test: భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి మ్యాచ్ జనవరి 3 నుంచి సిడ్నీలో జరగనుంది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో ఉంది. ఇదే సమయంలో టీమ్ ఇండియా వరల్డ్ టెస్ట్ (Sydney Test) ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ రేసులో నిలవాలంటే ఇప్పుడు సిడ్నీ టెస్టులో ఎలాగైనా గెలవాల్సిందే. మ్యాచ్‌కి ఒకరోజు ముందు టీమిండియాకు ఓ బ్యాడ్ న్యూస్ ఎదురైన‌ట్లు తెలుస్తోంది. దీని కారణంగా భారత జట్టు WTC ఫైనల్ ఆశలకు గండిప‌డే అవ‌కాశం ఉంది.

సిడ్నీ టెస్టుకు వ‌ర్షం ముప్పు?

నిజానికి సిడ్నీ టెస్టుపై ఇప్పుడు వర్షం నీడ ఆవరించింది. విజ్డెన్ క్రికెట్ నివేదిక ప్రకారం.. సిడ్నీ టెస్ట్ చివరి రెండు రోజుల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అదే జరిగితే ఈ మ్యాచ్ డ్రా అవుతుంది. ఇది టీమ్ ఇండియాకు పెద్ద దెబ్బగా నిరూపించవచ్చు. BBC వాతావరణ నివేదిక ప్రకారం.. ఐదో టెస్టు మొదటి రోజు తేలికపాటి వర్షం ప‌డే అవ‌కాశం ఉంది. ఇది కాకుండా నాలుగో రోజు 68 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది.

Also Read: Rythu Bharosa: సంక్రాంతికి ముందే రైతు భరోసా విడుదల?

దీంతో సిరీస్‌లో టీమిండియా 2-1తో వెనుకబడింది

ప్రస్తుతం సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియా 2 మ్యాచ్‌లు గెలవగా, టీమిండియా 1 మ్యాచ్‌లో విజయం సాధించింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ డ్రా అయింది. ప్రస్తుతం సిరీస్‌లో టీమ్‌ఇండియా 2-1తో వెనుకంజలో ఉంది. ఒకవేళ వర్షం కారణంగా సిడ్నీ టెస్టు కూడా డ్రా అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కూడా టీమిండియా కోల్పోయినట్టే. ఇదే సమయంలో టీమ్ ఇండియా ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా సిరీస్‌ను కాపాడుకోవడమే కాకుండా WTC ఆశలను సజీవంగా ఉంచుకోవాలని కోరుకుంటుంది.

టీమిండియాలో మార్పులు?

ఐదో టెస్టుకు టీమిండియా భారీ మార్పుల‌తో బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. స్టార్ బ్యాట‌ర్ వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌కు ఐదో మ్యాచ్‌కు విశ్రాంతి ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. పంత్ గ‌త 7 ఇన్నింగ్స్‌ల్లో కేవ‌లం 154 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. పంత్ స్థానంలో ధ్రువ్ జురేల్‌కు అవ‌కాశం ఇవ్వ‌నున్నారు. ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ వెన్నులో గాయం కారణంగా ఐదో టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆకాశ్ స్థానంలో హ‌ర్షిత్ రాణాకు అవ‌కాశం ఇవ్వ‌నున్నారు. అలాగే జ‌డేజా లేదా సుంద‌ర్ స్థానంలో ఫాస్ట్ బౌల‌ర్ ప్ర‌సిద్ధ్ కృష్ణ‌కు అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం.

Exit mobile version