Site icon HashtagU Telugu

Rahul Dravid: టీమిండియా ప్రధాన కోచ్ పదవి నుండి తప్పుకోనున్న రాహుల్ ద్రవిడ్..?

Rahul Dravid

Rahul Dravid

టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్‌, ఆసియాకప్‌ వంటి టోర్నీల్లో భారత జట్టు పరాజయం పాలైన తర్వాత ద్రవిడ్ పాత్రపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది కాకుండా భారత జట్టులోని ప్లేయింగ్ ఎలెవన్‌లో తరచుగా మార్పులు చేయడం వల్ల ద్రవిడ్ ను విమర్శిస్తూనే ఉన్నారు. ఒక మీడియా కథనం ప్రకారం.. బీసీసీఐ ఇప్పుడు విదేశీ కోచ్‌ని తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు పేర్కొంది. స్పోర్ట్స్ వెబ్‌సైట్ ఇన్‌సైడ్ స్పోర్ట్స్ నివేదిక ప్రకారం.. క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. మేము వివిధ ఎంపికలను పరిశీలిస్తున్నాము. మా ప్రణాళికల్లో రాహుల్ ముఖ్యమైన భాగం. అయితే రాహుల్ పై కూడా పనిభారం ఉంది. మా దృష్టి అంతా స్వదేశంలో జరిగే ప్రపంచకప్‌పైనే. ప్రపంచకప్ గెలవాలని అందరికీ స్పష్టంగా ఉంది. కాబట్టి ప్రస్తుతం మన దృష్టి టీ20 క్రికెట్‌పై లేదని స్పష్టమైంది. మేము ఈ అంశంపై చాలా చర్చిస్తున్నాము. అయితే తుది నిర్ణయం కోసం ఇందులో CAC, సెలక్టర్ల పాత్ర ముఖ్యమైనది. దీనికి కొంత సమయం పడుతుందని తెలిపారు.

Also Read: T20 World Cup 2023: టీ20 మహిళల ప్రపంచకప్ కోసం భారత జట్టు ప్రకటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..!

ఇటీవలే బంగ్లాదేశ్ పర్యటనను భారత జట్టు 2-0తో టెస్టు సిరీస్‌లో కైవసం చేసుకుంది. అయితే అంతకు ముందు ఇక్కడ జరిగిన వన్డే సిరీస్‌లో 1-2తో ఓడిపోయింది. ODI సిరీస్‌లో ఓటమి తర్వాత టీమిండియా టెస్ట్ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేయడం ద్వారా ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ రేసులో ఉంది. అయితే 2023లో జరిగే ఈ ఫైనల్‌కు భారత జట్టు 4 టెస్టు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంది. ఫిబ్రవరిలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో భారత్ ఇప్పుడు 4 టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది.