Chennai vs Mumbai వాంఖేడే లోనూ చెన్నై చెడుగుడు.. ముంబై పై ఘన విజయం

ఐపీఎల్ 16వ సీజన్ లో ముంబై ఇండియన్స్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రెండో మ్యాచ్ లోనూ పరాజయం పాలైంది.

Published By: HashtagU Telugu Desk
Rahane & Jadeja Fire As Chennai Super Kings Humble Mumbai Indians by 7 wickets

Rahane & Jadeja Fire As Chennai Super Kings Humble Mumbai Indians by 7 wickets

Chennai vs Mumbai IPLT20 2023 : ఐపీఎల్ 16వ సీజన్ లో ముంబై ఇండియన్స్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రెండో మ్యాచ్ లోనూ పరాజయం పాలైంది. వాంఖేడే స్టేడియం వేదికగా జరిగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబైకి ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ మంచి ఆరంభాన్నే ఇచ్చారు. తొలి వికెట్ కు 38 పరుగులు జోడించారు. ధాటిగా ఆడే క్రమంలో రోహిత్ ఔటైనప్పటకీ.. ఇషాన్ కిషన్ జోరు కొనసాగించాడు.

అయితే పవర్ ప్లే తర్వాత ముంబై వరుసగా వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషన్ 22 , కామెరూన్ గ్రీన్ 12, సూర్యకుమార్ యాదవ్ 2 పరుగులకే వెనుదిరిగారు.గత మ్యాచ్ లో అదరగొట్టిన తిలక్ వర్మ ఆదుకునేందుకు ప్రయత్నించాడు. 18 బంతుల్లో 2 ఫోర్లు,1 సిక్సర్ తో 22 పరుగులు చేసి ఔటవడంతో ముంబై మిగిలిన వికెట్లను కూడా వేగంగానే కోల్పోయింది.

చివర్లో టిమ్ డేవిడ్ 31 , హృతిక్ 18 పరుగులతో ధాటిగా ఆడడంతో స్కోర్ 150 దాటింది. ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. చెన్నై (Chennai) బౌలర్లలో రవీంద్ర జడేజా అదరగొట్టాడు. జడేజా 3 , శాంట్నర్ 2 , తుషార్ దేశ్ పాండే 2 వికెట్లు పడగొట్టారు. ఒకదశలో 200 వరకూ స్కోర్ చేస్తుందనుకున్న ముంబైని చెన్నై బౌలర్లు కట్టడి చేశారు.

158 పరుగుల లక్ష్యఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ తొలి ఓవర్ లోనే కాన్వే వికెట్ కోల్పోయింది. ఈ దశలో అజంక్య రహానే మెరుపు హాఫ్ సెంతరీతో అదరగొట్టాడు. ఊహించని విధంగా భారీ షాట్లతో చెలరేగిపోయాడు. సిక్సర్లు, ఫోర్లు బాదుతూ రెచ్చిపోయాడు. రహానే టీట్వంటీల్లో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం చాలా అరుదు.

దీంతో స్టేడియంలో ప్రేక్షకులు అతని బ్యాటింగ్ ను ఆస్వాదించారు. రహానే 27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. రహానే ఔటైనప్పటకీ.. రుతురాజ్ గైక్వాడ్ 36 బంతుల్లో 40 , శివమ్ దూబే 26 బంతుల్లో 28 రన్స్ చేశారు. చివర్లో అంబటి రాయుడు 16 బంతుల్లోనే 23 రన్స్ చేయడంతో చెన్నై 18.1 ఓవర్లలోనే టార్గెట్ అందుకుంది. ఈ సీజన్ లో చెన్నైకి ఇది రెండో విజయం. మరోవైపు ముంబై ఇండియన్స్ కు ఇది వరుసగా రెండో పరాజయం.

Also Read:  IPLT20 2023 DRS : అందుకే DRS అంటే ధోనీ రివ్యూ సిస్టమ్

  Last Updated: 08 Apr 2023, 11:44 PM IST