Punjab Kings; ఐపీఎల్ 2026 ప్రారంభానికి మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. 19వ సీజన్ మార్చి 28 నుండి మొదలుకానుంది. తొలి మ్యాచ్ ఆర్సీబీ (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరగనుంది. ఈసారి పంజాబ్ కింగ్స్ జట్టు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో బరిలోకి దిగుతోంది. అయితే సీజన్ ప్రారంభానికి ముందే పంజాబ్ కింగ్స్‌కు ఒక చేదు వార్త అందింది. ఆ జట్టులోని ముగ్గురు స్టార్ ప్లేయర్లు ప్రస్తుతం ఫామ్‌లో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
మార్కస్ స్టోయినిస్
ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్‌పై పంజాబ్ కింగ్స్ భారీ ఆశలు పెట్టుకుంది. అయితే అతని ప్రస్తుత ఫామ్ అస్సలు బాలేదు. ఇటీవలే ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2026లో స్టోయినిస్ పేలవ ప్రదర్శన చేశాడు. ఆస్ట్రేలియా తరపున 4 మ్యాచ్‌ల్లో కేవలం 55 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతని సగటు 18.33గా ఉంది. బౌలింగ్‌లో కూడా నిరాశపరిచి కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు.
Also Read: Donald Trump : ట్రంప్‌కు కోలుకోలేని దెబ్బ కొట్టిన మిత్రదేశాలు
ఫెర్గూసన్
న్యూజిలాండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ ఫెర్గూసన్ తన వేగానికి పెట్టింది పేరు. అతను నిరంతరం గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలడు. టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ తరపున 8 మ్యాచ్‌లు ఆడిన ఫెర్గూసన్ కేవలం 6 వికెట్లు మాత్రమే తీసి నిరాశపరిచాడు. ముఖ్యంగా భారత్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అత్యంత ఖరీదైన బౌలర్‌గా నిలిచాడు. కేవలం 2 ఓవర్లలోనే 48 పరుగులు సమర్పించుకున్నాడు.
కూపర్ కానోలీ
ఆస్ట్రేలియా బ్యాటర్ కూపర్ కానోలీ కూడా ఈసారి పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. అయితే, టీ20 వరల్డ్ కప్‌లో అతను తన బ్యాటింగ్‌తో ఆకట్టుకోలేకపోయాడు. ఆడిన 2 మ్యాచ్‌ల్లో కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. పంజాబ్ కింగ్స్ యాజమాన్యానికి ఈ ముగ్గురు ఆటగాళ్ల ఫామ్ ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ ఫైనల్ వరకు చేరుకున్నప్పటికీ ఆర్సీబీ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. దీంతో పంజాబ్ తొలిసారి టైటిల్ గెలవాలనే కల చెదిరిపోయింది. మరి ఈ సీజన్‌లో ఈ ఆటగాళ్లు పుంజుకుంటారో లేదో చూడాలి.
