ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ (Pro Kabaddi 2025) విశాఖపట్నంలో నేటి నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. కబడ్డీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సీజన్ తొలి రోజు రెండు మ్యాచ్‌లతో మొదలవుతుంది. తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు తమిళ తలైవాస్‌తో తలపడనుంది. తెలుగు టైటాన్స్ జట్టుకి తమ సొంత మైదానంలో ప్రేక్షకుల మద్దతు లభించడం అదనపు బలం కానుంది. ఇక రెండో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్, పుణెరి పల్టాన్ జట్లు పోటీపడతాయి. ఈ రెండు మ్యాచ్‌లు లీగ్‌కు అద్భుతమైన ప్రారంభాన్ని ఇస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.
Controversy : స్టేజ్ పై నటి నడుమును తాకి వివాదంలో చిక్కిన పవన్
ఈ సీజన్‌లో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. లీగ్ దశలో 108 మ్యాచ్‌లు జరుగుతాయి. విశాఖపట్నంతో పాటు, జైపూర్, చెన్నై, ఢిల్లీ వంటి నగరాలలో కూడా మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఈ లీగ్ దశ మ్యాచ్‌ల ద్వారా జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడానికి ప్రయత్నిస్తాయి. ఇంకా ప్లేఆఫ్స్, ఫైనల్స్ ఏ వేదికల్లో జరుగుతాయో నిర్వాహకులు ఇంకా ప్రకటించలేదు. లీగ్ అంతటా కబడ్డీ ప్రేమికులకు ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు చూడవచ్చు.
ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడాలనుకునే అభిమానుల కోసం స్టార్ స్పోర్ట్స్ 1/తెలుగు మరియు జియో సినిమా హాట్ స్టార్ లో ప్రసారం చేయనున్నారు. ఈ సౌలభ్యం వల్ల దేశంలోని ప్రతి మూల నుంచి కబడ్డీ అభిమానులు తమ అభిమాన జట్లను ప్రోత్సహించే అవకాశం లభిస్తుంది. ఈ సీజన్ విజయవంతంగా జరిగి, కబడ్డీ క్రీడకు మరింత ప్రాచుర్యం కల్పించాలని అభిమానులు కోరుకుంటున్నారు.