Site icon HashtagU Telugu

IPL 2025 : కన్నుగీటిన ప్రీతి జింటా ..వీడియో వైరల్

Preity Zinta's Wink

Preity Zinta's Wink

ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) అద్భుత ప్రదర్శనతో అభిమానులను మురిపించింది. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడి జట్టును విజయవంతంగా ఫైనల్‌కి చేర్చాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబయి నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ ఐదు వికెట్లు మిగిలేలా చేధించడం గమనార్హం. శ్రేయస్ అయ్యర్ 87 పరుగులతో అజేయంగా నిలిచి, నేహాల్ వధేరా (48 పరుగులు) సమర్థవంతమైన సహకారం అందించారు.

Telangana Formation Day : రాష్ట్రం ఏర్పడి పదేళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు – సీఎం రేవంత్

జట్టు విజయం ఫిక్స్ అవ్వగానే జట్టు యజమాని ప్రీతి జింటా (Preity Zinta) ఆనందంలో మునిగిపోయారు. స్టాండ్స్‌లో ఉత్సాహంగా సంబరాలు జరిపిన ఆమె, తర్వాత మైదానంలోకి వచ్చి ఆటగాళ్లతో కలిసి సెలబ్రేషన్లలో పాల్గొన్నారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరియు హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌లను ఆలింగనం చేసుకున్న ప్రీతి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. “11 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది” అంటూ ఐపీఎల్ అధికారిక ఖాతా కూడా ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. పంజాబ్ ఆటగాడితో ప్రీతి కన్నుగీటిన క్షణం కూడా అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది.

Ukraine : ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి పై జెలెన్‌స్కీ ప్రశంసలు..‘స్పైడర్ వెబ్‌’ ఆపరేషన్‌పై పూర్తి వివరాలు..!

ఈ విజయం ద్వారా పంజాబ్ కింగ్స్ జూన్ 3న జరగనున్న ఐపీఎల్ 2025 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఇరు జట్లూ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోవడంతో ఎవరు కప్పు గెలుచుకుంటారనేది ఉత్కంఠ గా మారింది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వం, రికీ పాంటింగ్ శిక్షణ, ప్రీతి జింటా మరియు నెస్ వాడియా వంటి యజమానుల మద్దతుతో పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో గెలుపుపై దృష్టి పెట్టింది. చూద్దాం ఎవరు కప్పు అందుకుంటారో..!!