Site icon HashtagU Telugu

All About Praggnanandhaa : చెస్ వరల్డ్ కప్ లో మన ప్రజ్ఞానంద హవా.. ఎవరతడు ?

All About Praggnanandhaa

All About Praggnanandhaa

All About Praggnanandhaa : ఇప్పుడు భారత యువ గ్రాండ్‌ మాస్టర్‌ ప్రజ్ఞానంద పేరు అంతటా మార్మోగుతోంది. 

ప్రపంచకప్‌ చెస్‌ టోర్నీ ఓపెన్‌ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లిన ప్రజ్ఞానంద హాట్ టాపిక్ గా మారాడు.. 

విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచకప్‌ టోర్నీలో ఫైనల్‌ కు చేరిన రెండో భారతీయ ప్లేయర్‌గా మన్ననలు అందుకుంటున్నాడు.. 

Also read : Chiranjeevi New Projects : మెగాస్టార్ బర్త్ డే సందర్బంగా..మెగా ప్రాజెక్ట్ ల ప్రకటన

ప్రజ్ఞానంద 2005 ఆగస్టు 10న  చెన్నైలో జన్మించారు. అతను 5 సంవత్సరాల వయస్సు నుంచే  చెస్ ఆడటం ప్రారంభించాడు. చెన్నైలోని వేలమ్మాళ్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ నుంచి హైస్కూల్ విద్యను పూర్తి చేశాడు. ప్రజ్ఞానంద సోదరి వైశాలి కూడా చెస్ ప్లేయరే. అతని తండ్రి రమేష్‌బాబు TNSC బ్యాంక్‌లో బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ప్రజ్ఞానంద తల్లి నాగలక్ష్మి గృహిణి. ప్రస్తుతం ప్రజ్ఞానంద (All About Praggnanandhaa) వయసు 18 ఏళ్లు. 10 సంవత్సరాల 10 నెలల 19 రోజుల వయస్సులోనే ప్రజ్ఞానంద అతి పిన్న వయస్కుడైన అంతర్జాతీయ చెస్ మాస్టర్ గా ఆవిర్భవించాడు.

Also read : BRS Tickets: మహిళలకు కేసీఆర్ మొండిచేయి, కేవలం ఏడుగురికే ఛాన్స్!

12 సంవత్సరాల 10 నెలల 13 రోజుల వయస్సులో చెస్  గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. ఈ ఘనత సాధించిన ఐదో అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. ప్రజ్ఞానంద 2013లో వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్ అండర్-8 టైటిల్‌ను, 2015లో అండర్-10 టైటిల్‌ను గెలుచుకున్నాడు. గతేడాది నవంబర్‌లో ప్రజ్ఞానందను అర్జున అవార్డుతో సత్కరించారు. ఇక చెస్ ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఒకవేళ ఫైనల్ లోనూ అతడు గెలిస్తే.. 21 ఏళ్ల తర్వాత చెస్  ప్రపంచ కప్ భారత్ కైవసం అవుతుంది.  భారత్ చివరిసారిగా 2002లో చెస్ ప్రపంచకప్ గెలిచింది. ఆ సమయంలో విశ్వనాథన్ ఆనంద్ మన దేశాన్ని చెస్  ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపారు.