PM Modi To Meet India: రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు టీమిండియాను క‌ల‌వ‌నున్న ప్ర‌ధాని మోదీ..!

  • Written By:
  • Updated On - July 3, 2024 / 04:25 PM IST

PM Modi To Meet India: బార్బడోస్ నుంచి తిరిగి వ‌స్తున్న భార‌త్ జ‌ట్టు (PM Modi To Meet India)ను ప్రధాని నరేంద్ర మోదీ రేపు అంటే జూలై 4న ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు. బెరిల్ తుఫాను కారణంగా గత రెండు రోజులుగా టీమిండియా బార్బడోస్‌లో చిక్కుకుపోయింది. జూలై 4న టీం ఇండియా భార‌త్‌కు తిరిగి రానుంది. ఈ బృందం మంగళవారం బార్బడోస్ నుంచి బయలుదేరి బుధవారం ఢిల్లీకి చేరుకుంటుందని తెలుస్తోంది.

టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత క్రికెట్ జట్టు చార్టర్ విమానంలో స్వదేశానికి బయలుదేరింది. బార్బడోస్ ప్రధాన మంత్రి మియా మోట్లీ మాట్లాడుతూ.. కేటగిరీ 4 తుఫాను కారణంగా మూసివేసిన ఇక్కడి విమానాశ్రయం “తదుపరి ఆరు నుండి 12 గంటల్లో” పని చేస్తుందని తాను భావిస్తున్నానని చెప్పారు. బెరిల్ తుఫాను కారణంగా రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు, సహాయక సిబ్బంది, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) ఆటగాళ్ల కుటుంబాలు గత రెండు రోజులుగా ఇక్కడ చిక్కుకుపోయిన విష‌యం తెలిసిందే.

Also Read: Spam Calls : స్పామ్ కాల్స్ వస్తున్నాయా ? ఈ సెట్టింగ్స్‌తో చెక్

గ‌త శనివారం జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించి భార‌త్ జ‌ట్టు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ టైటిల్ గెలుచుకుంది. కొన్ని నివేదిక‌ల ప్ర‌కారం.. బృందం బ్రిడ్జ్‌టౌన్ నుండి సాయంత్రం 6 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) బయలుదేరి బుధవారం రాత్రి 7:45 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఢిల్లీకి చేరుకుంటుందని తెలుస్తోంది. అనంతరం క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోదీ సన్మానించనున్నారు. కానీ ఇంకా షెడ్యూల్ ఖరారు కాలేదు. అయితే అందుతున్న స‌మాచారం ప్ర‌కారం గురువారం ఉద‌యం 11 గంట‌ల త‌ర్వాత ప్ర‌ధాని మోదీ టీ20 ప్ర‌పంచ క‌ప్ గెలిచిన టీమిండియా స‌భ్యుల‌ను క‌లుసుకుని వారిని అభినందించ‌నున్నారు.

ANI వార్తల ప్రకారం.. టీమిండియా ఆటగాళ్లను తీసుకురావడానికి బీసీసీఐ ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానాన్ని పంపింది. టీమ్ ఇండియా ఉదయం 11 గంటలకు ప్రధాని నివాసానికి చేరుకోవచ్చు. ప్రధాని మోదీని కలిసిన అనంతరం జ‌ట్టు ముంబైకి బయలుదేరి వెళ్ల‌నుంది.

We’re now on WhatsApp : Click to Join

పూర్తి షెడ్యూల్ ఇదేనా..!

గురువారం ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీని టీమ్ ఇండియా కలవవచ్చు. దీని తర్వాత అల్పాహారం తీసుకుంటారు. ఈ సమావేశం అనంతరం భారత ఆటగాళ్లు ముంబైకి బయలుదేరి వెళ్లనున్నారు. ఇక్కడ విజయోత్సవ కవాతు ఉంటుంది. ఆ తర్వాత భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి జై షా ప్రైజ్ మనీని అందజేయనున్నారు. టీమ్ ఇండియాకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో మద్దతుదారులు కూడా విమానాశ్రయానికి చేరుకోవచ్చు.

2007 చారిత్రక ఘట్టం మ‌రోసారి ముంబైలో పునరావృతమవుతుంది

2007లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో టీమిండియా టైటిల్‌ను గెలుచుకుంది. దీని తర్వాత ధోనీతో సహా ఆటగాళ్లందరూ ముంబైలోని ఓపెన్ బస్సులో ట్రోఫీతో ప్రయాణించారు. ఇప్పుడు మళ్లీ అదే జరగబోతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ సహా ఆటగాళ్లందరూ ఇందులో భాగం కానున్నారు.