PM Modi Meet Athletes: భార‌త అథ్లెట్ల‌తో స‌మావేశ‌మైన ప్ర‌ధాని మోదీ.. ఇదిగో వీడియో..!

పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు సెమీ ఫైనల్‌లో స్పెయిన్‌ను ఓడించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. కాగా భారత షూటర్ మను భాకర్ కూడా కాంస్య పతకాన్ని సాధించింది.

Published By: HashtagU Telugu Desk
PM Modi Meet Athletes

PM Modi Meet Athletes

PM Modi Meet Athletes: పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొని భార‌త్‌కు తిరిగి వ‌చ్చిన భారత క్రీడాకారులతో ప్రధాని మోదీ (PM Modi Meet Athletes) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత ప్రధాని అథ్లెట్లతో ముచ్చటించారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. భారత హాకీ జట్టు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ తన జెర్సీని ప్రధాని మోదీకి అందించారు. కాగా షూటర్ మను భాకర్ ప్రధానికి పిస్టల్ ఇచ్చారు.

పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు సెమీ ఫైనల్‌లో స్పెయిన్‌ను ఓడించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. కాగా భారత షూటర్ మను భాకర్ కూడా కాంస్య పతకాన్ని సాధించింది. అయితే ఇప్పుడు ఈ పతక విజేతలు కాకుండా పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న‌ ఇతర క్రీడాకారులు ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ లక్ష్యసేన్, సరబ్జోత్ సింగ్, మను భాకర్, సరబ్జోత్ సింగ్ వంటి అథ్లెట్లతో మాట్లాడారు. అయితే జావెలిన్ త్రోలో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా మాత్రం ఈ వేడుకలో పాల్గొనలేదు. ప్రస్తుతం నీరజ్ చోప్రా జర్మనీలో సర్జరీ చేయించుకుంటున్నాడు. ఈ కారణంగా ఆయన ఈ వేడుకలో పాల్గొనలేకపోయాడు.

Also Read: Minister Seethakka: కేసీఆర్ మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్‌.. మంత్రి సీత‌క్క ఫైర్‌..!

అయితే పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ దిగిన వీడియో అంతకంతకూ వైరల్ అవుతోంది. ఇది కాకుండా సోషల్ మీడియా వినియోగదారులు నిరంతరం కామెంట్ల ద్వారా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు 6 పతకాలు సాధించిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. ఇందులో 1 రజత పతకం కాకుండా 5 కాంస్య పతకాలు ఉన్నాయి. భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు. దీంతో పాటు మిక్స్‌డ్‌ జట్టులో మను భాకర్‌, సరబ్‌జోత్‌ సింగ్‌, అమన్‌ సెహ్రావత్‌, స్వప్నిల్‌ కుసాలే కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. పారిస్ ఒలింపిక్స్ జూలై 26 నుంచి మొద‌లై ఆగ‌స్టు 11 వ‌ర‌కు జ‌రిగిన విష‌యం తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

  Last Updated: 15 Aug 2024, 06:45 PM IST