Site icon HashtagU Telugu

Varanasi International Cricket Stadium: ఇండియాలో అతి పెద్ద క్రికెట్ స్టేడియానికి ప్రధాని శంకుస్థాపన ….

Varanasi International Cricket Stadium

Varanasi International Cricket Stadium

Varanasi International Cricket Stadium: ప్రధాని నరేంద్ర మోడీ సొంత పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి సహా భారత మాజీ క్రికెటర్లు, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ,ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి జే షా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరయ్యారు.

స్టేడియం కోసం భూమిని సేకరించేందుకు రూ.121 కోట్లు వెచ్చించగా, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) దీని నిర్మాణానికి రూ.330 కోట్లు వెచ్చించనుందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. రాజతలాబ్ ప్రాంతంలోని రింగ్ రోడ్ సమీపంలో నిర్మించనున్నస్టేడియం డిసెంబర్ 2025 నాటికి సిద్ధంగా ఉంటుంది. ఇక ఈ స్టేడియం గ్యాలరీలో చాలా ప్రత్యేకతలతో నిర్మించ బోతున్నారు.

వారణాసి మహా పుణ్య క్షేత్రం కాబట్టి ఆ మూలాలు ఉండేలా స్టేడియంలో గ్యాలరీలు ఉండబోతున్నాయి.శివుడికి సంబంధించిన సంగీత వాయిద్యం ఆకారంతోపాటు గంగా ఘాట్ మెట్లను పోలిన ప్రేక్షకుల గ్యాలరీలు ఉంటాయని తెలుస్తోంది. కాగా కాన్పూర్, లక్నో తర్వాత ఉత్తరప్రదేశ్‌లో సిద్ధమయ్యే ఈ స్టేడియం మూడో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. అంతర్జాతీయ క్రికెట్ కి ఉండాల్సిన అన్ని వసుతులతో ఈ స్టేడియం నిర్మితo అవుతుంది.ఇక్కడి క్రికెట్ ఫ్యాన్స్ ఆటను చూడడానికి వేరే నగరానికి వెళ్లాల్సిన పని లేదని , త్వరలోనే ఇక్కడే అంతర్జాతీయ క్రీకెట్ మ్యాచ్ లను చూస్తారని బిసిసిఐ తెలిపింది.

Also Read: Man Sell Alcohol on Vegetable Cart : కేటీఆర్ ఇలాకాలో తోపుడు బండిపై కూరగాయలతో పాటు మద్యం అమ్మకం..