IND vs AUS: ప్రారంభమైన నాలుగో టెస్టు.. మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన మోదీ, అల్బనీస్..!

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతోంది.

  • Written By:
  • Publish Date - March 9, 2023 / 09:55 AM IST

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఆస్ట్రేలియా-భారత్‌ల మధ్య జరుగుతున్న తొలిరోజు మ్యాచ్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ వీక్షించనున్న ఈ మ్యాచ్ ఇరు దేశాలకు చాలా ప్రత్యేకం. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు దేశాల ప్రధానూలు ప్రత్యేక రథంపై కూర్చొని స్టేడియంను చుట్టి వచ్చారు.

అంతకుముందు, ఇరు దేశాల ప్రధానులు ఉదయం 8:30 గంటలకు స్టేడియంకు చేరుకున్నారు. అక్కడ వారికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా స్వాగతం పలికారు. రెండు దేశాల ప్రధాని దాదాపు 2 గంటల పాటు స్టేడియంలోనే ఉండొచ్చు. ఈ సందర్భంగా స్టేడియం విశేషాలను కామెంటేటర్ రవిశాస్త్రి ప్రధానులిద్దరికీ వివరించి చెప్పారు. ఇరు దేశాల మధ్య 75 ఏళ్ల స్నేహానికి గుర్తుగా బీసీసీఐ తరపున అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఆసీస్ ప్రధానికి జ్ఞాపిక అందజేశారు.

ఈ టెస్ట్ సిరీస్ గురించి మాట్లాడుకుంటే.. భారత జట్టు ఇప్పటికీ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది. దీనిలో మొదటి 2 మ్యాచ్‌లలో ఏకపక్ష విజయంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీపై టీమ్ ఇండియా తన పట్టును నిలుపుకుంది. అదే సమయంలో ఇండోర్ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకుంది.

టాస్ గెలిచిన ఆసీస్

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆఖరి, నాలుగో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. మరోవైపు ఎలాగైనా సిరీస్‌ను సమం చేసుకోవాలని ఆసీస్ చూస్తుంది.