Pawan Tweet : నితీష్ రెడ్డిపై పవన్ ట్వీట్..ఇది కదా ట్వీట్ అంటే ..!!

Pawan Tweet : నువ్వు "భారత్" కోసం ఏం చేశావనేదే ముఖ్యం. నువ్వు మన భారత దేశాన్ని గర్వపడేలా చేశావ్ డియర్ నితీష్ కుమార్ రెడ్డి

Published By: HashtagU Telugu Desk
Pawan Tweet On Nithish

Pawan Tweet On Nithish

కంగారూల గడ్డపై ఖంగారులను పరుగెత్తించిన నితీష్ రెడ్డి (Nithish Reddy) పేరు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా మారుమోగిపోతుంది. తెలుగుగోడి సత్తా అంటే ఇదేరా అంటూ ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. అరంగేట్ర సిరీస్లోనే నితీశ్ సెంచరీ చేసి యావత్ క్రికెట్ అభిమానులను నితీష్ ఆకట్టుకున్నాడు. వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం దీటుగా ఎదుర్కొంటూ అద్భుతమైన షాట్లతో అలరించారు. ‘నితీశ్ అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్’ అంటూ భారత ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. నితీష్ సెంచరీ పై క్రీడా అభిమానులే కాదు రాజకీయ , సినీ , బిజినెస్ రంగ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది నితీష్ ను అభినందించగా..తాజాగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తనదైన స్టయిల్ లో నితీష్ పై ప్రశంసల జల్లు కురిపించారు.

” నువ్వు “భారత్”లోని ఏ ప్రాంతం నుంచి వచ్చావనేదీ ముఖ్యం కాదు. నువ్వు “భారత్” కోసం ఏం చేశావనేదే ముఖ్యం. నువ్వు మన భారత దేశాన్ని గర్వపడేలా చేశావ్ డియర్ నితీష్ కుమార్ రెడ్డి. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సెంచరీ చేసిన పిన్న వయస్కుడైన భారత క్రికెటర్‌గా నువ్వు చరిత్ర సృష్టించావ్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 114 పరుగులతో నువ్వు ఆడిన ఆట.. అద్భుతం. ఇలాంటి ప్రపంచ రికార్డులను మరెన్నో నువ్వు అందుకోవాలని కోరుకుంటున్నా. భారత త్రివర్ణ పతాకాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని.. మీ ఆటతో ఎంతో మంది యువ క్రీడాకారులకు ఆదర్శం కావాలని కోరుకుంటున్నా. మీ ఆటతో యువతకు క్రీడల పట్ల అభిరుచి, దృఢ సంకల్పం, ఆసక్తిని పెంపొందించేలా స్ఫూర్తినివ్వాలని ఆశిస్తున్నా. ఈ సిరీస్‌లో భారత్‌ ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా” అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం పవన్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

నితీష్ కుమార్ రెడ్డి తెలుగు క్రికెటర్ కావటంతో అందరూ తెలుగు కుర్రాడు మెరిశాడు, సత్తా చాటిన తెలుగు కుర్రాడు అంటూ అభినందనలు తెలియజేశారు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం భిన్నంగా ట్వీట్ చేశారు. మన దేశంలో ఎన్ని వైవిధ్యాలు, ప్రాంతాలు ఉన్నా.. మనందరం భారతీయులం అని చాటేలా ట్వీట్ ద్వారా పవన్ కళ్యాణ్ తన ఉద్దేశాన్ని తెలియజేశారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశం విశిష్టత అని.. మనం ఎక్కడి నుంచి వచ్చినా మన అంతిమ లక్ష్యం దేశానికి గొప్పపేరు తీసుకురావటమే అనేలా పవన్ కళ్యాణ్ ట్వీట్ ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read Also : Kavitha : ఈడీ కేసులో కేటీఆర్.. అలా జరిగితే కారు స్టీరింగ్ కవితకే !?

  Last Updated: 29 Dec 2024, 04:35 PM IST