Site icon HashtagU Telugu

Pakistan star bowler: పెళ్లి పీటలెక్కనున్న పాక్ ఫాస్ట్ బౌలర్

s. afridi

Cropped (1)

పాకిస్థాన్ బౌలర్ షాహిన్ ఆఫ్రిది (Shaheen Afridi) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహీద్ ఆఫ్రిది కుమార్తె ఆన్షాను షాహిన్‌ (Shaheen Afridi) వివాహం చేసుకోబోతున్నాడు. కరాచీలో ఈ పెళ్లి జరగనున్నట్లు ఆఫ్రిది కుటుంబసభ్యులు వెల్లడించారు. కాగా షాహిన్ 2021లో ప్రతిష్ఠాత్మక ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్న మొదటి పాకిస్థానీ ప్లేయర్‌గా నిలిచాడు.

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిది త్వరలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. అన్షా అఫ్రిదితో షాహీన్ పెళ్లి తేదీ ఖరారైంది. వచ్చే ఏడాది పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) ప్రారంభానికి ముందు ఫిబ్రవరి 3న వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారు. అన్షా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది పెద్ద కుమార్తె. పెళ్లి వార్తను షాహిద్ స్వయంగా ధృవీకరించారు. సంప్రదాయబద్ధంగా కరాచీలో వివాహ వేడుక జరగనుంది. షాహిద్ అఫ్రిది గత ఏడాది మార్చిలో షాహీన్, అన్షాల సంబంధం గురించి చెప్పాడు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

Also Read: KL Rahul: రెండో టెస్టుకు ముందు టీమిండియాకు షాక్.. కేఎల్ రాహుల్ దూరం..?

షాహీన్ ఏప్రిల్ 2018లో అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు. తక్కువ సమయంలో తనదైన ముద్ర వేయడంలో విజయం సాధించాడు. 25 టెస్టులు, 32 వన్డేలు, 47 టీ20ల్లో వరుసగా 99, 62, 58 వికెట్లు తీశాడు. షాహిన్ గత కొంతకాలంగా గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అతను గాయం కారణంగా 2022 ఆసియా కప్‌కు దూరమయ్యాడు. కానీ ఇంగ్లాండ్‌లో చికిత్స పొందిన తర్వాత 2022 T20 ప్రపంచ కప్‌లో తిరిగి వచ్చాడు. దీని తర్వాత అతను పాకిస్తాన్- ఇంగ్లాండ్ మధ్య జరిగిన టి 20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో గాయపడ్డాడు. అప్పటి నుండి మైదానంలోకి రాలేకపోయాడు. పాకిస్థాన్ ఇటీవల ఇంగ్లండ్‌తో షాహిన్ లేకుండా మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆడింది.