Pakistan vs Nepal: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం నేపాల్‌పై వీరవిహారం ప్రదర్శించాడు. ఆసియా కప్ మొదటి మ్యాచ్ లోనే సెంచరీ చేసి సత్తా చాటాడు. బాబర్ ఆజం 109 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో తన వన్డే కెరీర్‌లో 19వ సెంచరీని నమోదు చేశాడు.
ముల్తాన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. బాబర్ ఆజం మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. దీపేంద్ర సింగ్ ఎయిరీ వేసిన ఇన్నింగ్స్ 42వ ఓవర్ రెండో బంతికి డీప్ బ్యాక్‌వర్డ్ పాయింట్ వైపు షాట్ ఆడి రెండు పరుగులు చేసి సెంచరీ పూర్తి చేశాడు.
బాబర్ ఆజం తన వన్డే కెరీర్‌లో 102వ ఇన్నింగ్స్‌లో 19వ వన్డే సెంచరీని పూర్తి చేశాడు. బాబర్ వన్డేల్లో అత్యంత వేగంగా 19 సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ విషయంలో దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ హషీమ్ ఆమ్లాను బాబర్ ఆజం అధిగమించాడు. హషీమ్ ఆమ్లా 104 ఇన్నింగ్స్‌ల్లో 19 సెంచరీలు సాధించాడు.
అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 19 వన్డే సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్
బాబర్ ఆజం (పాకిస్తాన్) – 102*
హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా) – 104
విరాట్ కోహ్లీ (భారత్) – 124
డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) – 139
ఎబి డివిలియర్స్ (దక్షిణాఫ్రికా) – 171
పాకిస్థాన్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా బాబర్ ఆజం నిలిచాడు. సయీద్ అన్వర్ 244 ఇన్నింగ్స్‌ల్లో 20 సెంచరీలు చేశాడు.
Also Read: Potato Cauliflower Kebab: డాబా స్టైల్ పొటాటో కాలిఫ్లవర్ కబాబ్ ఇంట్లోనే చేసుకోండిలా?