World Cup 2023: అక్టోబర్ 5 నుంచి క్రికెట్ మహాసంగ్రామం ప్రారంభం కానుంది. ఈ పోరులో పది జట్లు హోరాహోరీగా పోటీపడతాయి. ఈ సారి టైటిల్ ఫెవరెట్ జట్లు భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా. ఇంగ్లాండ్, సోతాఫ్రికా జట్లు ఉన్నాయి. ప్రపంచ కప్ కు ముందు టీమిండియా తన సత్తా ఏంటో చూపించింది. వెస్టిండీస్ తో మొదలైన జైత్రయాత్ర ఆసియా కప్, ఆస్ట్రేలియాతో ముందు వన్డేల సిరీస్ వరకు సాగించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంగాలో భారత ఆటగాళ్లు రాణించారు. ఇక సీనియర్లు లేకపోయినా కప్ గెలిపిస్తామని యువరక్తం ప్రూవ్ చేసింది.
ప్రపంచ కప్ కు ముందు హైదరాబాద్ వేదికగా వార్మప్ మ్యాచ్ లు జరగనున్నాయి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. రేపు పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి వార్మప్ మ్యాచ్ జరుగుతుంది. పాకిస్తాన్ ఆటగాళ్లు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. అయితే వారికీ కేటాయించిన హోటల్ మెనులో బీఫ్ లేకపోయేసరికి ఆటగాళ్లు కాస్త నిరాశ చెందినట్లు సమాచారం. బీఫ్ ని బాగా ఇష్టపడే పాక్ ఆటగాళ్లు మెనులో బీఫ్ లేదని తెలిసి హోటల్ సిబ్బందిని అడిగారట. అయితే ప్రపంచ కప్ కప్ ఆటగాళ్లకు జారీ చేసిన ఫుడ్ మెనులో ఎవరికీ బీఫ్ సర్వ్ చేయబడదని సిబ్బంది తెలిపినట్లు సమాచారం.
అక్టోబర్ 6న నెదర్లాండ్స్‌తో ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ తొలి మ్యాచ్‌ను ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో అడుగుపెట్టిన పాకిస్థాన్ ఆటగాళ్లకు ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం లభించింది. పాకిస్థాన్ ఆటగాళ్లకు హైదరాబాద్ లోను ఫ్యాన్స్ ఉంటారు. కాబట్టి పాక్ జట్టు నగరంలో అడుగుపెట్టే సమయానికి కొందరు ఫ్యాన్స్ ఎయిర్ పోర్టుకు కూడా వచ్చారు. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ మరియు షాహీన్ షా అఫ్రిదీ తమ సోషల్ మీడియా ఖాతాలో హైదరాబాద్ విమానాశ్రయంలో తమకు ఘన స్వాగతం పలికిన ఫోటోలను పంచుకున్నారు.
Also Read: BRS Minister: నాడు తండ్లాట.. నేడు తండాలు అభివృద్ధి బాట: మంత్రి ఎర్రబెల్లి