world cup 2023: బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న న్యూజిలాండ్, పాకిస్థాన్ మ్యాచ్ లో వర్షం అంతరాయం ఏర్పడింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణిత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 భారీ పరుగులు చేసింది. ఇన్నింగ్స్ లో రచిన్ రవీంద్ర అద్భుత సెంచరీతో ఆకట్టుకోగా, కెప్టెన్ విలియమ్సన్ 95 పరుగుల వద్ద అవుట్ అయి సెంచరీ మిస్ చేసుకున్నాడు. అయితే బ్యాటింగ్ బరిలో పాకిస్థాన్ తొలుత తడబడింది. ఆరంభంలోనే మొదటి వికెట్ కోల్పోయింది. పాకిస్థాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ 6 పరుగులకే అవుట్ అయ్యాడు. పాకిస్తాన్.21 ఓవర్లు ముగిసేటప్పటికే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 160 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్ ఫకర్ జమాన్ సెంచరీతో చెలరేగగా కెప్టెన్ బాబర్ ఆజమ్..అర్థ సెంచరీకి మూడు పరుగుల దూరంలో వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్ ని 41 ఓవర్లకు కుదించారు. అంటే పాకిస్తాన్ 41 ఓవర్లలో 342 పరుగులు చేయాలి
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర జోడీ మరోసారి 50కి పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించగా, కాన్వే 35 పరుగులు చేసి ఔటయ్యాడు.ఇక రీ ఎంట్రీ ఇచ్చిన కేన్ విలియమ్సన్.రచిన్ రవీంద్రతో కలిసి 180 పరుగులు జోడించాడు. దీంతో రచిన్ 108 పరుగులతో ఈ ప్రపంచకప్ లో మూడో సెంచరీ నమోదు చేశాడు. కేన్ విలియమ్సన్ 95 పరుగులతో తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. డెర్రీ మిచెల్ 18 బంతుల్లో 29 పరుగులు , మార్క్ చాప్మన్ 27 బంతుల్లో 39, గ్లెన్ ఫిలిప్స్ 25 బంతుల్లో 41, మిచెల్ సాంట్నర్ 17 బంతుల్లో 26 పరుగులతో స్కోర్ బోర్డును పెంచడంలో సహాయపడ్డారు. పాక్ బౌలర్లలో మహ్మద్ వసీమ్ జూనియర్ 3 వికెట్లు తీయగా, హరీస్ రౌఫ్ 1, ఇఫ్తికర్ అహ్మద్ 1, హసన్ అలీ 1 వికెట్లు తీసుకున్నారు.
Also Read: Guntur Kaaram: గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది