బెలారస్‌కు చెందిన మాజీ ఒలింపిక్ స్విమ్మర్ (Former Olympic swimmer) అలియాక్సాండ్రా హెరాసిమేనియా (Aliaksandra Herasimenia)కు 12 ఏళ్ళ జైలుశిక్ష పడింది. మాజీ ఛాంపియన్ స్విమ్మర్, ప్రభుత్వ విమర్శకురాలు అలియాక్సాండ్రా హెరాసిమెనియాకు బెలారస్ లోని కోర్టు సోమవారం 12 సంవత్సరాల జైలు శిక్ష విధించిందని హక్కుల సంఘం తెలిపింది. తన కెరీర్‌లో ఒలింపిక్ పతకాలు గెలిచి 2019లో పదవీ విరమణ చేసిన హెరాసిమెనియా 2020 స్వీయ ప్రవాసంలో ఉండి విచారణకు హాజరు కాలేదు. ఆమె వల్ల దేశానికి హాని పొంచి ఉందన్న కారణంతో ఈ శిక్ష విధిస్తున్నట్లు కోర్టు తెలిపింది. అలెగ్జాండర్ లుకాషెంకో నిరంకుశ పాలనను నిరసించడంలో హెరాసిమేనియా, ఒపేకిన్ ముందు వరుసలో నిలిచి అపఖ్యాతిని సంపాదించుకున్నరు. అందుకే వారి వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భావించి జైలుశిక్ష విధించారని హక్కుల సంఘం తెలిపింది.
2020 ఆగస్టులో అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో తిరిగి ఎన్నికయ్యే ప్రయత్నానికి వ్యతిరేకంగా చెలరేగిన భారీ నిరసనల నేపథ్యంలో హెరాసిమానియా బెలారసియన్ స్పోర్ట్ సాలిడారిటీ ఫౌండేషన్ (BSSF)ని సహ-స్థాపన చేసింది. అధికారులు లక్ష్యంగా చేసుకున్న క్రీడాకారులకు ఫౌండేషన్ ఆర్థిక, చట్టపరమైన సహాయాన్ని అందించింది. 2012 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఆమె గెలుచుకున్న బంగారు పతకాన్నివేలం వేయగా $16,000కు పైగా వచ్చాయి. తద్వారా వచ్చిన మొత్తాన్ని ఫౌండేషన్‌కు మద్దతుగా ఉంచింది.
Also Read: India Squad SL Series: శ్రీలంకతో టీ20, ODI సిరీస్.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
అలియాక్సాండ్రాతో పాటు ఆమె స్నేహితుడు పొలిటికల్ యాక్టివిస్ట్ అలెగ్జాండర్ ఒపేకిన్‌కు కూడా 12 ఏళ్ల జైలుశిక్ష విధించినట్లు పేర్కొంది.
ఇక అలియాక్సాండ్రా మూడుసార్లు ఒలింపిక్ మెడల్స్ సొంతం చేసుకుంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో 50 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగం, 100 మీటర్ల ఫ్రీసైల్ విభాగంలో సిల్వర్ మెడల్ గెలిచిన ఆమె.. 2016 రియో ఒలింపిక్స్‌లో 50 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో కాంస్య పతకం సాధించింది.