Pallekele Cricket Stadium: పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో భారత జట్టు ఆసియా కప్ ప్రారంభించనుంది. సెప్టెంబర్ 2న క్యాండీ వేదికగా పల్లెకెలె క్రికెట్ స్టేడియం (Pallekele Cricket Stadium)లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మైదానంలో భారత జట్టు ప్రదర్శన ఎలా ఉంది? క్యాండీలో భారత జట్టు గణాంకాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మైదానంలో భారత జట్టు ఇప్పటి వరకు 3 మ్యాచ్‌లు ఆడింది.
పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో టీమిండియాదే పైచేయి
క్యాండీలోని పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో భారత జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ మైదానంలో టీమ్ ఇండియా రికార్డు 100%గా ఉంది. క్యాండీలోని పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో భారత జట్టు 3 మ్యాచ్‌లు ఆడగా.. మూడు మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు విజయం సాధించింది. ఈ మైదానంలో భారత జట్టు అత్యధిక స్కోరు 294 పరుగులు. ఈ మైదానంలో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి విజయం సాధించింది. కాగా ప్రత్యర్థి జట్టు 2 సార్లు పరుగుల ఛేజింగ్‌లో ఓడిపోయింది.
Also Read: Bat At No.4: ఓపెనర్లు వారే.. మరి నాలుగులో ఎవరు..?
పాకిస్థాన్ రికార్డు ఎలా ఉందంటే..?
మరోవైపు క్యాండీలోని పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్ జట్టు గణాంకాలను పరిశీలిస్తే చెప్పుకోదగిన విధంగా లేదు. ఈ మైదానంలో ఇప్పటి వరకు పాక్ జట్టు 5 వన్డేలు ఆడింది. ఈ 5 మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 3 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. క్యాండీలోని పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్ అత్యధిక స్కోరు 287 పరుగులు. క్యాండీ మైదాన్‌లోని పల్లెకెలె క్రికెట్ స్టేడియం గురించి మాట్లాడుకుంటే.. 2009 సంవత్సరంలో ఈ మైదానంలో మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మైదానంలో ఇప్పటి వరకు 33 వన్డేలు, 23 టీ20 మ్యాచ్‌లు, 9 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి.