World Cup: 2023 ప్రపంచ కప్ ప్రారంభమైంది. డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, మరియు న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ చేతులెత్తేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 282 పరుగులు చేయగా న్యూజిలాండ్ 283 పరుగులు చేసి బోణి కొట్టింది. ఇన్నింగ్స్ లో కన్వే, రవీంద్ర చెరో శతకాలతో కదం తొక్కారు. ఇదిలా ఉండగా గత ప్రపంచ కప్ లో జట్ల విజయాలు, అపజయాలు చూద్దాం.
ప్రపంచ కప్ టోర్నీలో భారత్ తో పాకిస్థాన్ ఇప్పటి వరకు ఏడుసార్లు తలపడింది. ఆడిన ఒక్క మ్యాచ్ లోను పాకిస్థాన్ విజయం సాధించలేదు. శ్రీలంకతో భారత్ వరల్డ్ కప్‌లో 8సార్లు ముఖాముఖి తలపడింది.ఇరు జట్లు చెరో నాలుగుసార్లు గెలిచాయి. భారత్ ఆస్ట్రేలియా జట్లు 12సార్లు ఫేస్ టు ఫేస్ తలపడగా.. ఆస్ట్రేలియా ఎనిమిదిసార్లు విజయం సాధించగా.. భారత్ నాలుగుసార్లు గెలుపొందింది. బంగ్లాదేశ్‌తో భారత్ నాలుగుసార్లు వరల్డ్ కప్‌లో ముఖాముఖి తలపడితే అందులో మూడుసార్లు మనోళ్లు ఆధిపత్యం ప్రదర్శించారు. ఇంగ్లాండ్, భారత్ ఇప్పటి వరకూ ఏడుసార్లు పోటీ పడితే నాలుగుసార్లు ఇంగ్లిష్ జట్టు గెలిచింది. మిగతా మూడు సందర్భాల్లో భారత్ విజయం సాధించింది. టీమిండియా దక్షిణాఫ్రికా. జట్లు ఐదుసార్లు ఫేస్ టు ఫేస్ తలపడ్డాయి. అందులో మూడుసార్లు సౌతాఫ్రికా గెలిస్తే రెండుసార్లు భారత్ నెగ్గింది. నెదర్లాండ్స్‌తో ఇప్పటి దాకా రెండు వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో తలపడిన ఇండియా.. రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందింది. అప్ఘానిస్థాన్‌పై 1-0 తేడాతో వరల్డ్ కప్‌లో భారత్ ఆధిక్యంలో ఉంది.
Also Read: Leo Trailer: లియో ట్రైలర్ భీభత్సం.. థియేటర్ ని నాశనం చేసిన ఫ్యాన్స్