Site icon HashtagU Telugu

RCB vs KKR: కోహ్లీ-గంభీర్ కు ఆస్కార్ ఇవ్వాల్సిందే

RCB vs KKR

RCB vs KKR

RCB vs KKR: కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య చిరకాల శత్రుత్వానికి తెరపడింది. మ్యాచ్‌లో విరామ సమయంలో గంభీర్, విరాట్ ఒకరినొకరు కౌగిలించుకోవడం ఆశ్చర్యపరిచింది. ఇది మాత్రమే కాదు. ఇద్దరి మధ్య కొంత సంభాషణ జరిగింది. ఆ తర్వాత గంభీర్-కోహ్లీ ముఖాల్లో చిరునవ్వు కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కోహ్లీ-గంభీర్ లపై ఆసక్తికర కామెంట్స్ చేశారు రవిశాస్త్రి మరియు సునీల్ గవాస్కర్.

మ్యాచ్ జరుగుతున్న సమయంలో గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లిని కౌగిలించుకున్నప్పుడు కామెంటరీ బాక్స్‌లో కూర్చున్న రవిశాస్త్రి.. ‘విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్‌ల కౌగిలింతకు కేకేఆర్‌కి ఫెయిర్ ప్లే అవార్డు ఇవ్వాలి’ అని సరదాగా అన్నాడు. శాస్త్రి తర్వాత సునీల్ గవాస్కర్ వెంటనే ఇలా అన్నాడు. ఫెయిర్‌ప్లే అవార్డ్‌ మాత్రమే కాదు, ఆస్కార్‌ అవార్డు కూడా ఇవ్వాలి అన్నారు. ప్రస్తుతం వీళ్లిద్దరి కామెంట్స్ కూడా ప్రస్తుతాం వైరల్ గా మారాయి.

గతేడాది ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ , గౌతమ్ గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నిజానికి కోహ్లి, నవీన్ ఉల్ హక్ మధ్య మాటల యుద్ధం జరిగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ వివాదంపై కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య తీవ్ర రచ్చ జరిగింది.దీంతో ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

We’re now on WhatsAppClick to Join.

ఇదిలా ఉండగా గత రాత్రి జరిగిన ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ లో కేకేఆర్ విజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ సునాయాసంగా 16.5 ఓవర్లలోనే ఛేదించింది. ఫిల్ సాల్ట్‌తో కలిసి సునీల్ నరైన్ కోల్‌కతాకు శుభారంభం అందించి తొలి వికెట్‌కు కేవలం 6.3 ఓవర్లలో 86 పరుగులు జోడించారు. నరైన్ కేవలం 22 బంతులు ఎదుర్కొని 47 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. అదే సమయంలో మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన వెంకటేష్ అయ్యర్ 30 బంతుల్లో 50 పరుగులు చేశాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా 24 బంతుల్లో 39 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా ఈ ఐపీఎల్ సీజన్లో వరుసులాగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఇక ఆర్సీబీ వరుసగా రెండు ఓటమిలను చవిచూడాల్సి వచ్చింది.

Also Read: Freshers Hiring : టీసీఎస్‌లో ఫ్రెషర్స్ రిక్రూట్‌మెంట్ షురూ.. వివరాలివీ

Exit mobile version