Dhoni Returns in IPL 2024 : ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి నాలుగు సీజన్లుగా చర్చ జరుగుతూనే ఉంది. 2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న మహేంద్ర సింగ్ ధోనీ, 2021లో చెన్నై సూపర్ కింగ్స్‌కి నాలుగో టైటిల్ అందించాడు.
2022 ఐపీఎల్ ఆరంభంలో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా, రవీంద్ర జడేజా కెప్టెన్‌గా ఫెయిల్ కావడంతో సీజన్ మధ్యలో మళ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. 2023 ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఐదో టైటిల్ అందుకున్న ధోనీ (Dhoni) సీజన్ మొత్తంగా మోకాలి గాయంతో ఇబ్బంది పడ్డాడు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సీజన్ తర్వాత మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న మహి వచ్చే ఐపీఎల్ సీజన్ ఆడతాడా అన్న చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ధోనీ (Dhoni) తన రిటైర్మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒక ఈవెంట్‌లో భాగంగా దీనిపై స్పందించాడు. ఐపీఎల్ 2024లో కూడా ఆడటానికి సిద్ధంగా ఉన్నానని ధోనీ చెప్పాడు. గాయానికి సర్జరీ అయిన తర్వాత తాను సౌకర్యంగానే ఉన్నానని, కోలుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే పూర్తి ఫిట్ నెస్ సాధించి ఐపీఎల్ 2024 సీజన్ లో ఆడతానని తెలిపాడు. గత సీజన్ సమయంలోనే ధోనీ (Dhoni) పలుసార్లు దీనిపై స్పందించాడు. టాస్ వేసే సమయంలో వ్యాఖ్యాత రిటైర్మెంట్ గురించి అడిగినప్పుడు ఇప్పుడే లేదని చెప్పాడు. తన ఆఖరి మ్యాచ్ చెన్నైలోనే ఆడతానని , సొంత ఫాన్స్ ముందే వీడ్కోలు పలుకుతానని స్పష్టం చేశాడు.
చెన్నై వేదికగా 2023 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ చివరి మ్యాచ్ ఆడినప్పుడు ఫాన్స్ కూడా భారీగా హాజరయ్యారు. ధోనీ కూడా మ్యాచ్ ముగిసిన తర్వాత పలువురు క్రికెటర్లకు ఆటోగ్రాఫ్ , జెర్సీ ఇవ్వడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో ధోనీ నిర్ణయం ప్రకటిస్తాడు అని అంతా భావించారు. అదేమీ జరగకపోవడంతో వచ్చే సీజన్ ఆడతాడని అంచనా వేశారు. ఇప్పుడు ధోనీ మరోసారి క్లారిటీ ఇవ్వడంతో చెన్నై ఫాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
మొత్తానికి అభిమానులకు శుభవార్తచెప్పిన ధోనీ 2024 ఐపీఎల్ లో మరోసారి చెన్నైను విజేతగా నిలుపుతాడో లేదో చూడాలి.
Also Read: Sania Mirza – Gaza : గాజాకు నీరు, ఆహారం ఆపడం కూడా యుద్ధమా ? ఇజ్రాయెల్‌పై సానియా ఫైర్