Site icon HashtagU Telugu

Nitish Rana- Ayush Badoni: మైదానంలో మరోసారి నితీష్ చీప్ ట్రిక్స్.. బదోనితో గొడవ

Nitish Rana- Ayush Badoni

Nitish Rana- Ayush Badoni

Nitish Rana- Ayush Badoni: నిత్యం వివాదాల్లో ఇరుక్కునే నితీష్ రాణా (Nitish Rana- Ayush Badoni) సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ అదే పంథాను అనుసరించాడు.ఈ టోర్నీలో భాగంగా రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ- యుపి జట్లు ముఖాముఖిగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోనీ, యూపీ బ్యాట్స్‌మెన్ నితీశ్ రాణా మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోను పరిశీలిస్తే నితీశ్ రాణా ఉద్దేశపూర్వకంగానే ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోనీని రెచ్చగొట్టినట్లు అర్ధమవుతుంది. నితీశ్ బౌలింగ్ వేశాడు. సింగిల్ కోసం వస్తున్న ఆయుష్ బదోనిని నితీష్ కావాలనే అడ్డుకున్నాడు. మొదట పక్కకి తప్పుకున్న బదోని ఆ తర్వాత నితీశ్ రాణా హద్దులు దాటడంతో ఘాటుగానే బదులిచ్చాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఫీల్డ్ అంపైర్లు కలగజేసుకుని ఆటగాళ్లను శాంతింపజేశారు. మైదానంలో నితీష్ రాణా వాగ్వాదానికి దిగడం ఇదే మొదటిసారి కాదు. 2023 ఐపీఎల్ సందర్భంగా నితీష్ మరియు హృతిక్ షౌకీన్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దేశవాళీ క్రికెట్‌లోనూ ప్రత్యర్థి ఆటగాళ్లను రెచ్చగొట్టడం నితీశ్ రాణాకు అలవాటుగా మారింది. ఇలాంటి బిహేవియర్ అంతర్జాతీయ క్రికెట్లో ఏ మాత్రం పనికిరాదు. ఐసీసీ చర్యలకు నితీష్ రాణా లాంటి ప్లేయర్ల కెరీర్ ముందుకెళ్లడం కష్టమే.

Also Read: CM Chandrababu On Jamili Elections: జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..

మ్యాచ్ విషయానికి వస్తే.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ 19 పరుగుల తేడాతో ఉత్తరప్రదేశ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో యూపీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. జట్టులో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ప్రియాంక ఆర్య అత్యధికంగా 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ యశ్ ధుల్ 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేశాడు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యూపీ జట్టు 20 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. జట్టు తరపున, ప్రియమ్ గార్గ్ 34 బంతుల్లో 6 ఫోర్లు మరియు 3 సిక్సర్ల సహాయంతో 54 పరుగులు చేసి హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు.