ప్రస్తుతం క్రికెట్‌లో తన దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్న వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ (Nicholas Pooran) కేవలం 29 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై (Retirement) చెప్పాడు. ఆయన ఈ నిర్ణయం ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచింది. పూరన్ వెస్టిండీస్ తరఫున అత్యధికంగా 106 టి20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు. ఇందులో ఆయన 2,275 పరుగులు చేశారు. అంతేకాదు, టి20 ఫార్మాట్‌లో వెస్టిండీస్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఫీల్డులో ఆయన ప్రదర్శన, జట్టుపై చూపిన ప్రభావం వలన వెస్టిండీస్ క్రికెట్‌పై ఆయన స్థిరమైన ముద్ర వేశాడు.
Maoists: భారత్ బంద్: మావోయిస్టుల పిలుపుతో హై అలర్ట్.. తెలంగాణ–ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో కూంబింగ్
టి20లతో పాటు పూరన్ వెస్టిండీస్ తరఫున 61 వన్డేలు ఆడి, 1,983 పరుగులు చేశారు. ఆయన వన్డేల్లో 3 శతకాలు, 11 అర్ధశతకాలు, అలాగే టి20ల్లో 11 అర్ధశతకాలు సాధించారు. కానీ, పూరన్‌కు టెస్ట్ క్రికెట్ ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఇప్పటివరకు పూరన్ 398 టీ20 మ్యాచ్‌లు ఆడి, మొత్తం 9,166 పరుగులు చేశాడు. ఇందులో 3 శతకాలు, 56 అర్ధశతకాలు ఉన్నాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ద్వారా తన రిటైర్మెంట్ ప్రకటించిన పూరన్ ఇలా అన్నారు
“ఈ ఆటను నేను ఎంతో ప్రేమిస్తున్నాను. ఈ ఆట నాకు అనేక ఆనందాలు, మర్చిపోలేని జ్ఞాపకాలు, వెస్టిండీస్ తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం అందించింది. మేరూన్ జెర్సీ ధరించడం, జాతీయ గీతానికి నిలబడటం, ప్రతి మ్యాచ్‌లో నా శక్తివంతమైన ప్రదర్శన ఇవ్వడం ఇవన్నీ నాకు ఎంతో ప్రత్యేకమైనవి. జట్టు కెప్టెన్‌గా వ్యవహరించడం నా జీవితంలో గర్వంగా నిలిచిపోతుంది” అని చెప్పుకొచ్చాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత పూరన్ ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్‌ల్లో కొనసాగనున్నారు. అతని రిటైర్మెంట్ వెస్టిండీస్ క్రికెట్‌కు నష్టం అయినా, క్రికెట్ అభిమానులు ఆయనను ఫ్రాంచైజీ క్రికెట్ ద్వారా మళ్లీ చూస్తూ ఆనందిస్తారు.