Site icon HashtagU Telugu

New Zealand: కేన్ విలియ‌మ్స‌న్ రిటైర్మెంట్ త‌ర్వాత కివీస్ జ‌ట్టులో కీల‌క మార్పులు!

New Zealand

New Zealand

New Zealand: న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ల మధ్య నవంబర్ 5 నుంచి ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్ జరగనుంది. 2026 T20 ప్రపంచ కప్‌కు ముందు ఈ సిరీస్ రెండు జట్లకూ చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ (New Zealand) తమ జట్టును ప్రకటించింది. మిచెల్ సాంట్నర్‌కు జట్టు కెప్టెన్సీని అప్పగించింది. జట్టు ప్రకటనకు ముందే న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ T20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. విలియమ్సన్ రిటైర్మెంట్ తర్వాత న్యూజిలాండ్ T20 జట్టులో పెద్ద మార్పు కనిపించింది. ఇద్దరు ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వచ్చారు.

ఇద్దరు స్టార్ ఆటగాళ్ల పునరాగమనం

కేన్ విలియమ్సన్ రిటైర్మెంట్ కారణంగా న్యూజిలాండ్ జట్టులోకి కైల్ జేమీసన్, ఇష్ సోధి తిరిగి వచ్చారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు చాలా కాలంగా T20 జట్టుకు దూరంగా ఉన్నారు. జేమీసన్ చివరిసారిగా ఇంగ్లాండ్‌తో వన్డే ఆడాడు. అయితే సోధి ఆస్ట్రేలియాతో జరిగిన T20 సిరీస్‌లో కనిపించాడు. ఇప్పుడు వీరిద్దరి పునరాగమనంతో జట్టు బౌలింగ్ అటాక్ మరింత బలంగా కనిపిస్తోంది.

Also Read: Hydraa : పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేద వాళ్లకు ఒక న్యాయం..ఇదే హైడ్రా తీరు – కేటీఆర్

అదే సమయంలో ఆల్‌రౌండర్ నాథన్ స్మిత్‌కు కూడా ఈ సిరీస్‌కు అవకాశం లభించింది. ఇక బ్యాటింగ్‌లో డెవాన్ కాన్వే, మైఖేల్ బ్రేస్‌వెల్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ పరుగులు చేసే బాధ్యత తీసుకుంటారు. బౌలింగ్‌లో సాంట్నర్, సోధి, జేమీసన్ వంటి అనుభవజ్ఞుల చేతుల్లో పగ్గాలు ఉంటాయి.

న్యూజిలాండ్‌కు ఐదుగురు ఆటగాళ్ల గాయాల బెడద

దీంతో పాటు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రస్తుతం తమ జట్టులోని ఐదుగురు ఆటగాళ్లు గాయపడ్డారని తెలిపింది. వీరిలో ఫిన్ అలెన్, లాకీ ఫెర్గూసన్, ఆడమ్ మిల్నే, గ్లెన్ ఫిలిప్స్, బెన్ సియర్స్ ఉన్నారు. కాగా మాట్ హెన్రీకి విశ్రాంతినిచ్చారు. ఫిన్ అలెన్‌కు కాలికి గాయం కాగా.. ఫెర్గూసన్ హామ్ స్ట్రింగ్ గాయంతో బాధపడుతున్నాడు. మిల్నేకు చీలమండలో సమస్య, ఫిలిప్స్‌కు గజ్జలో గాయం, సియర్స్ కూడా హామ్ స్ట్రింగ్ సమస్యతో బాధపడుతున్నాడు. అయితే ఈ ఆటగాళ్లందరూ 2026 T20 ప్రపంచ కప్ నాటికి ఫిట్‌గా ఉండి టోర్నమెంట్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉందని బోర్డు తెలిపింది.

వెస్టిండీస్ సిరీస్ కోసం న్యూజిలాండ్ T20 జట్టు

Exit mobile version