Site icon HashtagU Telugu

FIFA World Cup : ఫిఫా వరల్డ్ కప్‌ ఫైనల్‌‌కు ఆతిథ్యమిచ్చే నగరమదే.. షెడ్యూల్ ఇదీ

Fifa World Cup Min

Fifa World Cup Min

FIFA World Cup : 2026 సంవత్సరంలో కెనడా, మెక్సికో, అమెరికాలలో జరగనున్న ఫిఫా వరల్డ్ కప్‌లో ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చే నగరమేదో కన్ఫార్మ్ అయిపోయింది. ఫైనల్ మ్యాచ్ న్యూయార్క్/న్యూజెర్సీ‌లోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరుగుతుంది.  ఈ స్టేడియంలో ఏకకాలంలో 82,500 మంది ప్రేక్షకులు కూర్చునే సౌకర్యం ఉంది. మెక్సికో సిటీలోని అజ్టెకా స్టేడియంలో జూన్ 11న ప్రపంచకప్(FIFA World Cup) తొలి మ్యాచ్ జరుగుతుంది. 16 అత్యాధునిక స్టేడియాల్లో మొత్తం 104 మ్యాచ్‌లు జరగనున్నాయి. జూలై 4న  అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం ఉంది. ఆ రోజున ఫిలడెల్ఫియాలో రౌండ్-ఆఫ్-16 గేమ్‌లు జరుగుతాయి. అట్లాంటా, డల్లాస్ నగరాలు సెమీఫైనల్స్‌కు ఆతిథ్యం ఇవ్వనుండగా, మూడో స్థానానికి సంబంధించిన గేమ్ మయామిలో జరుగుతుంది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు లాస్ ఏంజెల్స్, కాన్సాస్ సిటీ, మియామి, బోస్టన్‌లలో జరుగుతాయి. చివరిసారిగా అమెరికాలో 1994లో ఫిఫా వరల్డ్ కప్ నిర్వహించారు. అప్పట్లో ఫైనల్ మ్యాచ్ లాస్ ఏంజెల్స్ సమీపంలోని పసాదేనాలో ఉన్న రోజ్ బౌల్‌ స్టేడియంలో జరిగింది.

We’re now on WhatsApp. Click to Join

ఆతిథ్యమిస్తున్న 16 నగరాలివే..

ఫిఫా వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిస్తున్న నగరాల జాబితాలో.. అట్లాంటా, బోస్టన్, డల్లాస్,  గ్వాడలజార, హ్యూస్టన్, కాన్సాస్ సిటీ,  లాస్ ఏంజెల్స్, మెక్సికో సిటీ, మయామి,  మాంటెరీ,  న్యూయార్క్-న్యూజెర్సీ,  ఫిలడెల్ఫియా, శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా, సియాటెల్,  టొరంటో, వాంకోవర్ ఉన్నాయి.

Also Read : Fake Vehicle Insurance : నకిలీ వెహికల్ ఇన్సూరెన్స్ పత్రాలకు చెక్.. త్వరలో ఆ పద్ధతి ?

ఫిబ్ర‌వ‌రి 21న లియోన‌ల్ మెస్సీ డాక్యుమెంట‌రీ  విడుద‌ల

ఫుట్‌బాల్ మాంత్రికుడు లియోన‌ల్ మెస్సీ సార‌థిగా అర్జెంటీనాకు ఎన్నో విజ‌యాలు అందించాడు. వాటిలో రెండేండ్ల క్రితం ఖ‌తార్ గ‌డ్డ‌పై ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీని గెలిచిన సంద‌ర్భం మాత్రం చాలా ప్ర‌త్యేకం. ఆ రోజుతో సాక‌ర్ దిగ్గ‌జం త‌న ప్ర‌పంచ కప్ ట్రోఫీ క‌ల‌ను నిజం చేసుకున్నాడు. దాంతో, మెస్సీ వ‌ర‌ల్డ్ క‌ప్ ప్ర‌యాణాన్ని యాపిల్ కంపెనీ డాక్యుమెంట‌రీగా రూపొందించింది. ‘మెస్సీస్ వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర్నీ : రైజ్ ఆఫ్ ఏ లెజెండ్'(Messi’s World Cup Journey : The Rise Of A Legend) పేరుతో చిత్రీక‌రించిన ఈ డాక్యుమెంట‌రీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 21న ఈ విడుద‌ల కానుంది. మెస్సీ జీవితంలోని కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు, కెరీర్‌లోని ముఖ్య సంఘ‌ట‌న‌లు ఈ డాక్యుమెంట‌రీలో క‌నిపిస్తాయి. 17 ఏండ్ల ప్ర‌యాణంలో ఒక విజ‌యం. నా క‌థ‌ని మీతో పంచుకోవాల‌ని ఎంతో ఆతృత‌గా ఉన్నా అని మెస్సీ త‌న‌పై వ‌స్తోన్న డాక్యుమెంట‌రీపై స్పందించాడు. దాంతో, ఫుట్‌బాల్ ఫ్యాన్స్ త‌మ ఆరాధ్య ఆట‌గాడిని తెర‌పై చూసేందుకు ఎదురు చూస్తున్నారు.