New Cricket Stadium: ముంబైలోని వాంఖడే స్టేడియం ప్రేక్షకుల సామర్థ్యం పరంగా చాలా చిన్నది. వాంఖడే చారిత్రక స్టేడియం అయినప్పటికీ ఇప్పుడు ముంబైలో కొత్త స్టేడియం (New Cricket Stadium) గురించి ఆలోచిస్తున్నారు. కొత్త స్టేడియం వాంఖడే కంటే దాదాపు 4 రెట్లు పెద్దదిగా ఉండనుంది. అంటే కొత్త స్టేడియం సీటింగ్ సామర్థ్యం వాంఖడే కంటే దాదాపు 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ కొత్త స్టేడియం గురించి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడారు.
ఇటీవల బార్బడోస్ వేదికగా జరిగిన 2024 టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఛాంపియన్ టీమ్ ఇండియా బార్బడోస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ముంబైలో ఓపెన్ బస్సుతో విజయోత్సవ పరేడ్ కూడా నిర్వహించింది. ఈ పరేడ్ తర్వాత ముంబైకి చెందిన టీమ్ ఇండియా జట్టు సభ్యులు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే మహారాష్ట్ర అసెంబ్లీకి వెళ్లారు. రోహిత్ శర్మ కూడా మరాఠీలో అసెంబ్లీలో ప్రసంగించారు. ఈ విషయాలన్నింటి తర్వాత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కొత్త స్టేడియం గురించి మాట్లాడారు. ఇప్పుడు ముంబైకి ఆధునిక స్టేడియం అవసరమని అన్నారు. ఇంకా ఎక్కువ మంది ప్రేక్షకులు ఉండగలిగే స్టేడియం కావాలని పేర్కొన్నారు.
Also Read: Hardik Divorce: మరోసారి తెరపైకి హార్దిక్- నటాషా విడాకుల వార్తలు.. కారణమిదే..?
ముంబైకి ఇప్పుడు వాంఖడే కంటే పెద్ద స్టేడియం అవసరం. వాంఖడే ఒక చారిత్రక స్టేడియం అని నాకు తెలుసు, కానీ ఇప్పుడు ముంబైకి 1 లక్ష కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న కొత్త స్టేడియం అవసరం. భవిష్యత్తులో దానిని నిర్మించడానికి ప్రయత్నిస్తామని దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. అయితే కొత్త స్టేడియం నిర్మాణానికి సంబంధించి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
We’re now on WhatsApp : Click to Join
వాంఖడే స్టేడియం చరిత్ర
వాంఖడే స్టేడియం 1974లో నిర్మించారు. ఈ స్టేడియంలో సుమారు 32,000 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. ఇదే చారిత్రాత్మక మైదానంలో 2011 వన్డే ప్రపంచకప్‌లో ఎంఎస్ ధోని సారథ్యంలో టీమిండియా ఫైనల్‌లో విజయం సాధించింది. 2011 వన్డే ప్రపంచకప్ ట్రోఫీని ధోనీ ఈ మైదానం నుంచి సిక్సర్ కొట్టి వరల్డ్ కప్ గెలుచుకున్నాడు.