world cup 2023: షమీ వికెట్లు తీస్తే.. భార్య టార్గెట్ అవుతుంది..

ఐసీసీ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ షమీ ప్రదర్శనకు నెటిజన్ల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే కొందరు ఫ్యాన్స్ షమీ భార్యను ట్రోల్ చేస్తున్నారు. షమీపై హసిన్ జహాన్ బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్, పాకిస్థానీ ఏజెంట్లతో సంబంధాలు

world cup 2023: ఐసీసీ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ షమీ ప్రదర్శనకు నెటిజన్ల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే కొందరు ఫ్యాన్స్ షమీ భార్యను ట్రోల్ చేస్తున్నారు. షమీపై హసిన్ జహాన్ బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్, పాకిస్థానీ ఏజెంట్లతో సంబంధాలు మరియు గృహ హింస వంటి ఆరోపణలు చేసిందని అలాగే మహ్మద్ షమీ నుంచి నెలకు 10 లక్షలు డిమాండ్ చేసిందని అయితే అవేం అతని ఆత్వవిశ్వాసాన్ని దెబ్బతియ్యలేదని కామెంట్స్ చేస్తున్నారు. దానికి రెండింతలు బలంగా తయారవుతున్నాడు. వివాహ వివాదాలకు గురైన పురుషులు నిజంగా షమీ నుండి నేర్చుకోవాలి అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

కొన్ని సంవత్సరాల క్రితం హసిన్ జహాన్ గృహ హింస ఆరోపణలను మాత్రమే కాకుండా, మ్యాచ్ ఫిక్సింగ్‌లో షమీ ప్రమేయం గురించి కూడా ఆరోపించింది. దీనికి షమీ కూడా సమాధానం ఇచ్చాడు. నేను నా దేశం కోసం చనిపోతాను, ఎప్పుడూ ద్రోహం చేయను అంటూ దేశభక్తి చాటుకున్నాడు. ఇదిలా ఉండగా విడిపోయిన భార్య హసిన్ జహాన్ మరియు ఆమె కుమార్తె కోసం నెలకు రూ. 50,000 భరణం చెల్లించాలని మహ్మద్ షమీని కోర్టు ఆదేశించింది.

ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన ఐసీసీ ప్రపంచకప్ మ్యాచ్‌లో షమీ ఏడు ఓవర్లలో నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఆదివారం లక్నోలో జరిగిన ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ను 100 పరుగుల తేడాతో ఓడించిన భారత పేస్ దళం మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌ను చిత్తు చేశారు.ఈ విజయంతో భారత్ ఆరు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లండ్ ఆరు మ్యాచ్‌ల్లో ఒక విజయం, ఐదు ఓటములతో అట్టడుగున ఉంది. మహ్మద్ షమీ ఈ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టి, డిఫెండింగ్ ఛాంపియన్‌పై జట్టు విజయం సాధించడంలో కీ రోల్ ప్లే చేశాడు.

Also Read: Human Error : ఆ రైలు లోకోపైలట్ సిగ్నల్ జంప్ వల్లే ప్రమాదం ?!