Site icon HashtagU Telugu

Hardik Pandya Divorce Rumors: వేరొకరితో పాండ్యా భార్య చక్కర్లు.. విడాకులపై స్పందన

Hardik Pandya Divorce Rumors

Hardik Pandya Divorce Rumors

Hardik Pandya Divorce Rumors: భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, అతని భార్య నటాషా స్టాంకోవిచ్‌ల విడాకుల వార్త ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది. ఈ వార్త పెను సంచలనం సృష్టించింది. హార్దిక్, నటాషా నిజంగా విడిపోతున్నారా అనే చర్చ బాలీవుడ్ నుండి క్రికెట్ ప్రపంచం వరకు సాగుతుంది. ఇప్పుడు ఈ వార్తల మధ్య నటాషా తమ విడాకులపై తొలిసారిగా స్పందించింది. ఆమె స్పందించిన ఈ వీడియో వైరల్ గా మారింది.

ఇటీవల నటాషా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేరు మార్చింది. అందులో పాండ్యా పేరును తొలగించింది. దీంతో వీరిద్దరూ విడిపోతున్నారా అనే చర్చ సాగుతోంది. ఈ సీజన్ ఐపీఎల్ లో పాండ్యా కెప్టెన్‌గా ఉన్న ముంబై ఇండియన్స్‌ను ఉత్సాహపరిచేందుకు నటాషా స్టేడియంలో కనిపించలేదు. దీంతో వారి మధ్య దూరం పెరిగినట్లు వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. ఇదిలా ఉండగా నటాషా మరొక వ్యక్తితో తిరుగుతూ కెమెరాకు చిక్కింది. నటాషా ఓ వ్యక్తితో వెళుతున్న సమయంలో కొందరు జర్నలిస్టులు హార్దిక్‌తో విడాకుల వార్తల గురించి నటాషాను ప్రశ్నించారు. దానికి నటాషా ధన్యవాదాలు అంటూ ఆమె అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఇన్‌స్టాబాలీవుడ్ పేరుతో ఇన్‌స్టా హ్యాండిల్ ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆమె ఇచ్చిన ఈ సమాధానంతో ఆల్రెడీ వారి మధ్య విడాకులు కూడా అయినట్లు తెలుస్తుంది.

2020లో కోవిడ్-19 మధ్య వీళ్లిద్దరు సహజీవనం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. పాండ్యా పడవలో నటాషాకు ప్రపోజ్ చేశాడు. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి ఉంటున్నారు. ఆ తర్వాత ఇద్దరూ గతేడాది రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదటి వివాహం హిందూ ఆచారాల ప్రకారం, రెండవది క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం జరిగింది. వారిద్దరికీ అగసత్య అనే కొడుకు కూడా ఉన్నాడు.

Also Read: Health: కొలెస్ట్రాల్ ఉన్నవారు ఈ ఫుడ్ తినకూడదు, ఎందుకంటే