Asia Cup 2025: క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించడానికి ఆసియా కప్ 2025 (Asia Cup 2025) సిద్ధమైంది. సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ గడ్డపై ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈసారి ఎనిమిది దేశాలు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నమెంట్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న పాక్‌తో మ్యాచ్ ఆడనుంది.
సూర్యకుమార్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా
ఈ టోర్నమెంట్ కోసం భారత జట్టు ప్రకటన త్వరలో వెలువడనుంది. నివేదికల ప్రకారం.. సెలెక్టర్లు మొత్తం 34 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేశారు. ఈ 34 మందిలోంచి 15 మందితో కూడిన తుది జట్టును ఎంపిక చేయనున్నారు. టీ20 ఫార్మాట్ కావడంతో టీమ్ ఇండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేయనున్నట్లు సమాచారం.
Also Read: Severe Headache : విపరీతమైన తలనొప్పి తరచూ వస్తుందా? ముందు ఇలా చేశాక స్కాన్స్ చేయించుకోండి!
వికెట్ కీపర్: స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ గాయం కారణంగా ఈ టోర్నమెంట్‌కు దూరంగా ఉండనున్నారు. కాబట్టి వికెట్ కీపర్ బాధ్యతలను సంజూ శాంసన్ చేపట్టే అవకాశం ఉంది. సెలెక్టర్ల మొదటి ఎంపికగా కూడా సంజూనే ఉన్నట్లు తెలుస్తోంది.
బౌలింగ్ విభాగం: భారత బౌలింగ్ విభాగానికి కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉండనున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకరైన జస్ప్రీత్ బుమ్రా తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లకు సవాలు విసిరే అవకాశం ఉంది. అతనికి యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తోడుగా ఉండనున్నాడు. స్పిన్ విభాగం బాధ్యతలు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్‌లపై ఉండనున్నాయి. ఆసియా కప్‌లో భారత్ అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తుందా లేదా అనేది చూడాలి. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో జట్టు ఏ విధంగా ముందుకు వెళ్తుందో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్లు వారి అద్భుతమైన ఐపీఎల్ 2025 ప్రదర్శన కారణంగా టీ20 జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.