Mumbai Indians: మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఐదుగురిని నిలబెట్టుకుంది. వేలంలో మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్‌ల కోసం తెగ కష్టపడింది. అనుకున్నట్టుగానే జట్టును నిర్మించింది జట్టులో భారీ హిట్టర్లు, పేసర్లు ఉన్నప్పటికీ మంచి స్పిన్నరని తమ జట్టులో చేర్చుకోవడంలో విఫలమైంది. టీమిండియా టాప్ ఆటగాళ్లు అయిన జస్‌ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాలను అంటిపెట్టుకున్న ముంబై ఇండియన్స్ వేలంలో చాలా తెలివిగా వ్యవహరించింది.
అయితే ముంబై ఇండియన్స్ జట్టును జాగ్రత్తగా పరిశీలిస్తే జట్టులో ఒక్క భారతీయ అనుభవజ్ఞుడైన స్పిన్నర్ కూడా లేడు. మిచెల్ సాంట్నర్‌ను జట్టులో చేర్చుకున్నప్పటికీ అతను విదేశీ స్పిన్నర్. మిచెల్ సాంట్నర్ మన పిచ్ లపై ప్రభావం చూపించడం అంత ఈజీ కాదు.మెగా వేలంలో ముంబై మేనేజ్మెంట్ దీపర్ చాహర్ , ట్రెంట్ బౌల్ట్‌లను కొనుగోలు చేసింది. పవర్‌ప్లేలో ఇద్దరికీ మంచి రికార్డు ఉంది. ముంబై ఇండియన్స్‌లో ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా రూపంలో ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. వీళ్ళకి తోడు ఒక్క ఇండియన్ స్పిన్నర్ ఉంటే ముంబై ఇండియన్స్ బౌలింగ్ దళం మరింత పటిష్టంగా కనిపించేది.మెగా వేలంలో పేస్ అటాక్‌ను పటిష్టం చేయడంపై ముంబై ఎక్కువ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దీని కారణంగానే స్పిన్ విభాగాన్ని పట్టించుకోలేదు.
Also Read: Manish Pandey: స్టార్ క్రికెటర్ మనీష్ పాండేకు బిగ్ షాక్
ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆర్డర్ కు ఎలాంటి ఢోకా లేదు. ఎందుకంటే ఆ జట్టులో రిటైన్ చేసుకున్న ఆటగాళ్లందరూ ఇంటర్నెషనల్ క్రికెట్ ఆడిన స్టార్ ప్లేయర్లే. ఇక ముంబై ఇండియన్స్ జట్టును ఒకసారి చూస్తే.. జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్, నమన్ ధీర్, రాబిన్ మింజ్, కర్ణ్ శర్మ, ర్యాన్ రికెల్టన్, దీపక్ చాహర్, అల్లా ఘజన్‌ఫర్, విల్ జాక్వెస్, అశ్విని కుమార్, మిచెల్ సాంట్నర్, రీస్ టోప్లే , రాజ్ అంగద్ బావా, సత్యనారాయణ రాజు, బెవోన్ జాకబ్స్, అర్జున్ టెండూల్కర్ ఉన్నారు.