Site icon HashtagU Telugu

Sakshi Dhoni Smoking: సిగ‌రెట్ తాగుతున్న ఎంఎస్ ధోనీ భార్య సాక్షి.. నిజ‌మెంత‌..?

Sakshi Dhoni Smoking

Sakshi Dhoni Smoking

Sakshi Dhoni Smoking: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భార్య సాక్షి ధోనీ (Sakshi Dhoni Smoking) తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన గురించిన అప్‌డేట్‌లను అభిమానులకు అందజేస్తుంది. ప్ర‌స్తుతం సాక్షి ఫోటో ఒక‌టి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. అందులో ఆమె సిగరెట్ తాగుతూ కనిపిస్తుంది. అయితే ఈ చిత్రం నిజమో కాదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఫొటోలో సాక్షి విదేశాల్లో ఉన్న‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. పార్టీ సందర్భంగా తీసిన చిత్రంలో సాక్షి సిగరెట్‌ కాలుస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ ఫొటోలో సాక్షి స్మోకింగ్ చేస్తుందని నిర్ధారించలేము. ఇది కేవలం ఒక ఫొటో మాత్ర‌మే. ఇందులో ఆమె స్మోకింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సాక్షి ధోనీ ఫోటోపై అభిమానుల నుండి భిన్నమైన స్పందనలు కనిపిస్తున్నాయి.

Also Read: Wednesday: బుధవారం ఇలా చేస్తే చాలు విగ్నేశ్వరుడి అనుగ్రహం కలగడం ఖాయం!

 

సాక్షి ధోని ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని చిత్రాలను పంచుకున్నారు. అందులో ఆమె సుందరమైన గ్రీస్‌లో ఆనందిస్తున్నట్లు కనిపించింది. ఈ సమయంలో బాలీవుడ్ నటి, మోడల్ కరిష్మా తన్నా కూడా కనిపించింది. ఇంతలో కరిష్మా తన్నా కొన్ని చిత్రాలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. అందులో అభిమానులు సాక్షి చేతిలో సిగరెట్‌ను గమనించారు. సిగరెట్లకు సంబంధించి సాక్షి పేరు చర్చల్లోకి రావడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు ఆమె కాలేజీ రోజుల ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ఫొటో కూడా ధూమపానానికి సంబంధించినదే. అయినప్పటికీ ఆమె ధూమపానం గురించి ఇప్పటికీ ఎలాంటి రియాక్ష‌న్ ఇవ్వ‌లేదు.

We’re now on WhatsApp. Click to Join.

ధోనీ హుక్కా తాగుతున్న వీడియో వైరల్‌గా మారింది

గ‌తంలో ఎంఎస్ ధోని హుక్కా తాగుతున్న వీడియో వైరల్‌గా మారిన విష‌యం తెలిసిందే. ధోనీ వీడియోపై చాలా చర్చలు జరిగాయి. ఆ వీడియోలో మహి స్నేహితులతో కలిసి హుక్కా తాగుతూ కనిపించాడు.