MS Dhoni Daughter: ధోనీ కుమార్తె జీవాకు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన మెస్సీ

ఇటీవల అర్జెంటీనా (Argentina) ఫిఫా ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా (Argentina) ఫ్రాన్స్‌ను ఓడించింది. ఈ ప్రపంచకప్ విజయంలో లియోనెల్ మెస్సీ ఏడు గోల్స్ చేసి కీలక పాత్ర పోషించాడు. అర్జెంటీనా విజయంతో భారత్‌లోనూ సంబరాలు జరిగాయి. కాగా మెస్సీ సంతకం చేసిన జెర్సీని భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కుమార్తె జివా ధోనీ (Ziva Dhoni) అందుకుంది.

  • Written By:
  • Publish Date - December 28, 2022 / 01:55 PM IST

ఇటీవల అర్జెంటీనా (Argentina) ఫిఫా ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా (Argentina) ఫ్రాన్స్‌ను ఓడించింది. ఈ ప్రపంచకప్ విజయంలో లియోనెల్ మెస్సీ ఏడు గోల్స్ చేసి కీలక పాత్ర పోషించాడు. అర్జెంటీనా విజయంతో భారత్‌లోనూ సంబరాలు జరిగాయి. కాగా మెస్సీ సంతకం చేసిన జెర్సీని భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కుమార్తె జివా ధోనీ (Ziva Dhoni) అందుకుంది. నిజానికి టీమిండియా మాజీ కెప్టెన్ ధోని భార్య సాక్షి ధోనీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి జివా ఫోటోను పంచుకున్నారు. ‘లైక్‌ ఫాదర్‌, లైక్‌ డాటర్‌’ అంటూ సరదాగా క్యాప్షన్‌ ఇచ్చారు.

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అందులో ఆమె అర్జెంటీనా జెర్సీని ధరించి కనిపించింది. జెర్సీపై మెస్సీ సంతకం చేసినట్లు ఫోటోలో చూడవచ్చు. జీవా ఈ ఫోటోను ధరించి సంతోషంగా ఉంది. సాక్షితో పాటు,ఈ చిత్రాలు జీవా ధోని ఖాతా నుండి కూడా షేర్ చేయబడ్డాయి. మెస్సీ, ధోనీ ఇద్దరూ తమ దేశాలకు ప్రపంచ కప్ విజేతలు. వివిధ క్రీడలలో ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి. సూపర్ స్టార్లు ఇద్దరూ తమ దేశానికి కెప్టెన్లుగా ఉన్నారు.

Also Read: India Squad SL Series: శ్రీలంకతో టీ20, ODI సిరీస్‌.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

2011 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ 79 బంతుల్లో అజేయంగా 91 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. అదే సమయంలో లుసైల్ స్టేడియంలో జరిగిన 2022 FIFA వరల్డ్ కప్ ఫైనల్‌లో మెస్సీ ఫ్రాన్స్‌పై రెండు గోల్స్ చేశాడు. లియోనెల్ మెస్సీ ఈ ఎడిషన్‌లో మొత్తం ఏడు గోల్స్ చేసి తన జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. మెస్సీకి అత్యుత్తమ ప్రదర్శనకు గోల్డెన్ బాల్ అవార్డు లభించింది. 2014 తర్వాత ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం ఇది రెండోసారి. ఈ ప్రపంచకప్‌లో మెస్సీ పెనాల్టీ ద్వారా ఏడు గోల్‌లకు నాలుగు గోల్స్ చేశాడు.