Site icon HashtagU Telugu

MS Dhoni: ధోనీని ఇబ్బంది పెడుతున్న కొత్త హెయిర్‌స్టైల్‌.. స్వయంగా చెప్పిన కెప్టెన్ కూల్..!

MS Dhoni

MS Dhoni

MS Dhoni: భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni)కి చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ధోనీకి సంబంధించిన ప్రతి వార్తను తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఉంటారు. ఈ రోజుల్లో అతను మరోసారి పొడవాటి జుట్టుతో కనిపించాడు. ధోనీ పొడవాటి హెయిర్‌స్టైల్‌కి అభిమానులు చాలా సంతోషించడమే కాకుండా ఆ హెయిర్ స్టైల్ కాపీ కొడుతున్నారు. అయితే చాలా రోజులు షార్ట్ హెయిర్ తో కనిపించిన ధోనీ ఒక్కసారిగా జుట్టు ఎందుకు పెంచాడనే ప్రశ్న కూడా జనాల్లో నెలకొంది. మీకు కూడా ఇదే ప్రశ్న ఉంటే.. దానికి మాజీ కెప్టెన్ స్వయంగా సమాధానం ఇచ్చాడు.

ఈ పెద్ద ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నా అభిమానులకు చాలా ఇష్టం కాబట్టి నేను పొడవాటి జుట్టు ఉంచుకున్నాను అని మహి చెప్పాడు. అంతే కాకుండా పెద్ద జుట్టు వలన ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ధోనీ హైలైట్ చేశాడు. పొడవాటి జుట్టును ఉంచుకోవడం చాలా కష్టమైన పని అని చెప్పారు. చిన్న జుట్టుతో నేను 20 నిమిషాల్లో సిద్ధంగా ఉండగలను. అయితే ఇప్పుడు ఒక గంట 10 నిమిషాలు పడుతుంది. ఏదో ఒక రోజు నేను లొంగీ హెయిర్ తీసేస్తాను అని చెప్పుకొచ్చాడు.

Also Read: Year Ender 2023: 2023లో బ్యాచ్లర్ లైఫ్ కి గుడ్ బై చెప్పిన టీమిండియా ఆటగాళ్లు

ధోనీ ఎప్పుడు మైదానంలోకి దిగుతాడా అని అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. మహి ఇకపై ఐపీఎల్‌లో తప్ప ఎక్కడా పాల్గొనడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అతడి ఆటతీరు చూడాలంటే వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం వేచి చూడాల్సిందే. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా మహి లీగ్‌లో పాల్గొంటాడు. ఐపీఎల్‌కు ముందు అతను CSK ప్రాక్టీస్ మ్యాచ్‌లలో కూడా ప్రాక్టీస్ చేయడం కనిపించింది. 2024 మార్చి నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.