MI vs CSK: వాంఖడేలో ధోనీ సిక్సర్ల మోత.. ధీటుగా బదులిస్తున్న రోహిత్

వాంఖడేలో చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ తలపడుతుంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై అదరగొట్టింది. టాపార్డర్ ముంబై బౌలర్లని ధీటుగా ఎదుర్కోగా, చివర్లో మహేంద్ర సింగ్ ధోనీ సిక్సర్ల వర్షం కురిపించాడు.

MI vs CSK: వాంఖడేలో చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ తలపడుతుంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై అదరగొట్టింది. టాపార్డర్ ముంబై బౌలర్లని ధీటుగా ఎదుర్కోగా, చివర్లో మహేంద్ర సింగ్ ధోనీ సిక్సర్ల వర్షం కురిపించాడు. చివరి ఓవర్ వేసిన హార్దిక్ పాండ్య బౌలింగ్ లో మాహీ విజ్రంభించాడు. బంతి బంతిని సిక్సర్ గా మలుస్తూ 500 స్ట్రైక్ రేట్‌తో వాంఖడే స్టేడియాన్ని హోరెత్తించాడు. ధోనీ కేవలం 4 బంతులు మాత్రమే ఎదుర్కొని 20 పరుగులు చేశాడు. ధోనీ ధాటికి ఆడటంతో సీఎస్‌కే 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన చెన్నైకి శుభారంభం లభించలేదు. 5 పరుగుల వద్ద అజింక్య రహానే ఔటయ్యాడు. రహానే పెవిలియన్‌కు చేరుకున్న తర్వాత, రచిన్ రవీంద్రతో కలిసి రుతురాజ్ గైక్వాడ్ రెండో వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రుతురాజ్ ఒక ఎండ్ నుండి అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ 40 బంతుల్లో 69 పరుగులు చేశాడు. రుతురాజ్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో మోత మోగించాడు. గైక్వాడ్ తో పాటు శివమ్ దూబే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దూబే 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 పరుగులతో సత్తా చాటాడు.

207 భారీ పరుగుల లక్ష్యఛేదనలో ముంబై ధీటుగా రాణిస్తుంది. అయితే ఇషాన్ కిషన్ 23 పరుగులతో పెవిలియన్ చేరుకోగా రోహిత్ శర్మ జట్టు భారాన్ని తీసుకుని రాణిస్తున్నాడు. ఈ క్రమంలో 30 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టాడు. రోహిత్ హాఫ్ సెంచరీ చేసే సమయానికి 7 ఫోర్లు, 2 భారీ సిక్సర్లు నమోదు చేశాడు. ఇక కిషన్ అవుట్ అవ్వడంతో ఇంపాక్ట్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ నిరాశ పరుస్తూ డక్ గా వెనుదిరిగాడు. కాగా 9 ఓవర్ల సమయానికి 2 వికెట్లు కోల్పోయి 81 పరుగులతో పోరాడుతుంది. ఈ సమయానికి క్రీజులో రోహిత్, తిలక్ వర్మ ఉన్నారు.

We’re now on WhatsApp : Click to Join

ప్రస్తుత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడింటిలో విజయం సాధించగా,రెండు మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మరోవైపు హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్‌లో రెండు మ్యాచ్ ల్లో ఓడి. గత రెండు మ్యాచ్‌ల్లో వరుసగా విజయం సాధించింది.

Also Read: Balakrishna : జే బ్రాండ్ పేరుతో మహిళల తాళిబొట్లు తెంచుతున్న కిరాతకుడు జగన్ – బాలకృష్ణ