MS Dhoni: గత ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రదర్శన చాలా నిరాశపరిచింది. జట్టు కెప్టెన్సీని మొదట రుతురాజ్ గైక్వాడ్, ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) చేపట్టినప్పటికీ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. 14 మ్యాచ్‌లలో కేవలం 4 మాత్రమే గెలిచి 10 మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మాక్సీవిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ ప్రారంభోత్సవంలో ధోని ఐపీఎల్ గురించి మాట్లాడారు. స్పోర్ట్స్‌స్టార్ నివేదిక ప్రకారం.. రాబోయే సీజన్‌కు జట్టులో మార్పులు తప్పవని ధోని సంకేతాలిచ్చారు.
ధోని ఏమన్నాడు?
ధోని తన ప్రసంగంలో జట్టులోని లోపాలను అంగీకరించారు. “మా జట్టులో కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని మేము సరిదిద్దుకోవాలి. బ్యాటింగ్ ఆర్డర్ గురించి మాకు కొంత ఆందోళన ఉండేది. కానీ ఇప్పుడు అది చాలా వరకు స్థిరపడింది. రుతురాజ్ గైక్వాడ్ తిరిగి జట్టులోకి వస్తాడు కాబట్టి బ్యాటింగ్ ఆర్డర్ స్థిరంగా ఉంటుంది” అని ధోని పేర్కొన్నారు.
Also Read: Methi Water Benefits: ప్రతిరోజూ మెంతి నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలివే!
డిసెంబర్‌లో ఐపీఎల్ 2026 మినీ వేలం
రాబోయే సీజన్‌కు ముందే జట్టులోని లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తామని ధోని తెలిపారు. “మేము ఎక్కడ తప్పు చేశామో చాలావరకు గుర్తించాం. డిసెంబర్‌లో జరిగే మినీ వేలంలో ఆ లోపాలను సరిదిద్దడానికి ప్రయత్నిస్తాం. టోర్నమెంట్ ప్రారంభం నుంచే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి. అలాంటి ప్రణాళిక రూపొందించుకోవాలి. జట్టులోని వనరులను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. మేము చాలా విషయాలను మెరుగుపరుచుకుని, మెరుగైన ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తాం” అని ధోని చెప్పారు.
తన రిటైర్మెంట్‌పై ధోని ఫన్నీ కామెంట్స్
గత కొన్ని సీజన్‌లుగా ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. తన ఫిట్‌నెస్‌పై స్పందిస్తూ.. ధోని నవ్వుతూ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. “నేను మరో ఐదు సంవత్సరాలు క్రికెట్ ఆడగలను. కానీ నాకు కళ్లకు మాత్రమే అనుమతి లభించింది. నాకు నా శరీరం కోసం కూడా అనుమతి కావాలి. నేను కేవలం కళ్లతో క్రికెట్ ఆడలేను” అని ధోని అన్నారు. ఈ వ్యాఖ్యలు ధోని ఎంత ఫిట్‌గా ఉన్నప్పటికీ తన శరీరానికి విశ్రాంతి అవసరమని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2026 సీజన్‌లో ధోని ఆడతారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు.