Site icon HashtagU Telugu

MS Dhoni 150 Catches: ఐపీఎల్‌లో 150 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్‌కీపర్‌గా ధోనీ రికార్డు

MS Dhoni

MS Dhoni

MS Dhoni 150 Catches: ఈ రోజు పంజాబ్ కింగ్స్‌తో జరిగిన 53వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుత సీజన్‌లో మహీ ఇలా ఔటై అవ్వడం ఇదే తొలిసారి. ధర్మశాలలో పంజాబ్ తో జరుగుతున్న ఏ మ్యాచ్ లో ధోని డక్ ఔట్ కావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయినప్పటికీ మాహీ ఓ విషయంలో రికార్డ్ నమోదు చేశాడు.

నిజానికి ధోనీ కీపింగ్ లో ఆరితేరాడు. క్షాణాల్లో వికెట్లను గిరాటేయ్యడం ధోనీ స్పెషల్. సందర్భాన్ని బట్టి వికెట్ల వెనుక తన మార్క్ చూపిస్తుంటాడు. వికెట్ల వెనుక అద్భుతమైన క్యాచ్‌లు ఒడిసి పట్టడంలో సిద్ధహస్తుడు. కాగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిమ్రంజిత్ సింగ్ బంతికి పంజాబ్ కింగ్స్‌ ఆటాగాడు జితేష్ శర్మ క్యాచ్ పట్టి ధోనీ రికార్డ్ సాధించాడు. ఈ మ్యాచ్ లో శర్మ క్యాచ్ ద్వారా ఐపీఎల్‌లో 150 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్‌కీపర్‌గా ధోనీ రికార్డు సృష్టించాడు.

We’re now on WhatsAppClick to Join

ధోనీ తన 261వ మ్యాచ్‌లో ఈ మైలురాయిని సాధించాడు. ఐపీఎల్‌లో వికెట్ కీపర్‌గా అత్యధిక క్యాచ్‌లు పట్టడంలో ధోనీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో వికెట్‌కీపర్‌గా 144 క్యాచ్‌లు పట్టిన దినేష్ కార్తీక్ రెండో స్థానంలో ఉన్నాడు. ఏబీ డివిలియర్స్ 119 క్యాచ్‌లతో మూడో స్థానంలో ఉన్నాడు.

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి వచ్చాడు. ఈ సమయంలో అతను అద్వితీయ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో మహీ 8వ ర్యాంక్‌ కంటే దిగువకు దిగడం ఇదే తొలిసారి. అయితే ఈ నంబర్ అతనికి దురదృష్టకరంగా మారింద. హర్షల్ పటేల్ దెబ్బకు ధోని సున్నా వ్యక్తిగత స్కోరు వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

Also Read: Ambati Rambabu : పవన్ కల్యాణే ..నా అల్లుడ్ని రెచ్చగొట్టింది – అంబటి రాంబాబు

Exit mobile version