Site icon HashtagU Telugu

MS Dhoni Awards: ధోని జీవితంలో సాధించిన విజయాలు, అవార్డులు

MS Dhoni Awards

New Web Story Copy 2023 05 24t182448.346

MS Dhoni Awards: భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) క్రికెట్ కెరీర్ సగటు క్రికెటర్ కి ఆదర్శం. మాహీ కెప్టెన్సీలో టీమ్ ఇండియా క్రికెట్ ప్రపంచంలో అత్యున్నత స్థాయికి ఎదిగింది. 23 డిసెంబర్ 2004న అంతర్జాతీయ క్రికెట్ కు పరిచయం అయిన ధోనీ 15 ఆగస్టు 2019న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ అద్భుతమైన అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణంలో ధోని అనేక అవార్డులు మరియు విజయాలు గెలుచుకున్నాడు.

మహేంద్ర సింగ్ ధోనీకి 2018 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఇచ్చే మూడవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మభూషణ్ లభించింది. దీని తరువాత మరుసటి సంవత్సరం 2009లో క్రీడా ప్రపంచంలో అతని అత్యుత్తమ ప్రదర్శనకు పద్మశ్రీ అవార్డును అందుకున్నాడు. 2008 మరియు 2009 సంవత్సరాలలో ICC పురుషుల ODI క్రికెటర్ ఆఫ్ ది అవార్డును అందుకున్నాడు. 2006లో ధోనికి MTV యూత్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది.

2011 సంవత్సరంలో ధోని స్పిరిట్ ఆఫ్ క్రికెట్ కోసం ICC అవార్డును గెలుచుకున్నాడు. అదే ఏడాది క్యాస్ట్రోల్ ఇండియన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ ఏడాది ఆగస్టు నెలలో డి మోంట్‌ఫోర్ట్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. అదే సంవత్సరం ప్రముఖ నేషనల్ మీడియా నుంచి ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు.

2019 సంవత్సరంలో జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ రాంచీలోని జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సౌత్ స్టాండ్‌కు MS ధోని పేరు పెట్టింది. 2023 సంవత్సరంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ వాంఖడే స్టేడియంలో J 282 నుండి J 286 వరకు ఉన్న సీట్లను MS ధోనీ సీట్లుగా పేర్కొంది. 2011 ప్రపంచకప్ ఫైనల్‌లో ఈ సీట్ల మధ్య ధోనీ భారీ సిక్స్ కొట్టి దేశానికి ప్రపంచ కప్ అందించడంతో ముంబై క్రికెట్ అసోసియేన్ ఈ నిర్ణయం తీసుకుంది.

Read More: MS Dhoni: మాహీ .. నా ఆయుష్యు తీసుకుని ఇంకో వందేళ్లు క్రికెట్ కొనసాగించు