ICC Hall Of Fame: ఎంఎస్ ధోనీకి అరుదైన గౌర‌వం.. ICC హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం!

ఎంఎస్ ధోనీ 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన ODI మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. మూడు సంవత్సరాల తర్వాత అంటే 2007లో ధోనీకి టీమ్ ఇండియా కెప్టెన్సీ లభించింది.

Published By: HashtagU Telugu Desk
ICC Hall Of Fame

ICC Hall Of Fame

ICC Hall Of Fame: జూన్ 9న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC Hall Of Fame) ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ICC హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం కల్పించారు. ఈ ఘనత సాధించిన 11వ భారత క్రీడాకారుడిగా ఆయన నిలిచారు. ధోనీ భారతదేశం అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా పరిగణించబడతారు. ఆయన మూడు ఫార్మాట్లలోనూ భారత్ తరపున అద్భుతమైన ప్రదర్శన చేయడంతో పాటు అత్యుత్తమ కెప్టెన్సీని కూడా ప్రదర్శించారు.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చింది. అంతర్జాతీయ, భారత క్రికెట్‌లో ఆయన అసమానమైన కృషికి ఈ గౌరవం లభించింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ (WTC ఫైనల్ 2025)కు రెండు రోజుల ముందు లండన్‌లో ఒక కార్యక్రమం నిర్వ‌హించారు. ఇందులో ఎంఎస్ ధోనీతో సహా ఏడుగురు దిగ్గజ క్రికెటర్లను హాల్ ఆఫ్ ఫేమ్‌తో సన్మానించారు.

ఎంఎస్ ధోనీతో పాటు మాథ్యూ హెడెన్, గ్రీమ్ స్మిత్, డానియల్ విట్టోరీ, హాషిమ్ ఆమ్లాలను కూడా హాల్ ఆఫ్ ఫేమ్‌తో సన్మానించారు. ఈ జాబితాలో చేరిన మొత్తం 11వ భారత క్రికెటర్‌గా ధోనీ నిలిచారు. ధోనీకి ఈ గౌరవం అంతర్జాతీయ రిటైర్మెంట్ తర్వాత సుమారు 5 సంవత్సరాల తర్వాత లభించింది. ధోనీ 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు. ఎంఎస్ ధోనీ ఆడిన చివరి మ్యాచ్ 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్.

Also Read: Senior Journalist Kommineni: తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌కు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని!

ఎంఎస్ ధోనీ ‘కెప్టెన్ కూల్’గా పిలుస్తారు ఆయ‌న అభిమానుల‌. అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. ఆయన కెప్టెన్సీలో భారత్ మూడు ICC ట్రోఫీలను గెలుచుకుంది. ధోనీ నాయకత్వంలో టీమ్ ఇండియా 2007 T20 వరల్డ్ కప్, 2011 ODI వరల్డ్ కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను సాధించింది.

ఎంఎస్ ధోనీ 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన ODI మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. మూడు సంవత్సరాల తర్వాత అంటే 2007లో ధోనీకి టీమ్ ఇండియా కెప్టెన్సీ లభించింది. 2007 T20 వరల్డ్ కప్‌లో భారత జట్టు ఒక యువ క్రీడాకారుడి నాయకత్వంలో ఆడింది. కానీ ఫైనల్‌లో భారత్.. పాకిస్తాన్‌ను ఓడించినప్పుడు మొత్తం భారతదేశం ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో భారత్ 2010, 2016లో ఆసియా కప్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది. అతను 2008, 2009లో ICC ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా పొందాడు.

ICC హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేరిన భారతీయులు

ఇప్పటివరకు ICC హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేరిన భారతీయుల పేర్లు: ఎంఎస్ ధోనీ, నీతూ డేవిడ్, డయానా ఎడుల్జీ, సచిన్ టెండూల్కర్, వీనూ మాంకడ్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్, బిషన్ సింగ్ బేడీ, సునీల్ గవాస్కర్.

 

  Last Updated: 09 Jun 2025, 10:29 PM IST