Site icon HashtagU Telugu

Mohammed Siraj: న‌టి మ‌హిరా శ‌ర్మ‌తో సిరాజ్ డేటింగ్‌..?

Mohammed Siraj

Mohammed Siraj

Mohammed Siraj: ప్ర‌స్తుతం మహ్మద్ సిరాజ్ టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు సిరాజ్ (Mohammed Siraj) డేటింగ్ కు సంబంధించి ఓ కీలక వార్త బయటకు వచ్చింది. బిగ్ బాస్ 13 ఫేమ్ నటి మహిరా శర్మతో సిరాజ్ డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సిరాజ్ ఇటీవల ఆశా భోంస్లే మనవరాలు జనై భోంస్లే పుట్టినరోజు వేడుకలో కనిపించాడు. సిరాజ్, జనైపై చాలా వార్త‌లు వచ్చాయి. దీని తర్వాత వారిద్దరూ అన్నచెల్లెల‌ బంధానికి తెర తీశారు.

‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లోని ఒక వార్త ప్రకారం.. సిరాజ్- మహిరా డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కథనం ప్రకారం వీరిద్దరికీ గత నవంబర్‌లో పరిచయం ఏర్పడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ ఇంకా ఒకరినొకరు ఫాలో అవుతున్న‌ప్ప‌టి నుంచి ఈ డేటింగ్ న్యూస్ మ‌రింత ఎక్కువ‌య్యాయి. అయితే డేటింగ్ విషయంపై మహీరా లేదా సిరాజ్ నుండి ఇంకా అధికారిక సమాచారం రాలేదు.

Also Read: Osmania Hospital: వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌తో ఉస్మా‘‘నయా హాస్పిటల్’’: మంత్రి

మహిరా ప్రేమలో సిరాజ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడా?

సిరాజ్ జనై పుట్టినరోజు పార్టీలో కనిపించాడు. ఈ సమయంలో బాలీవుడ్‌కి సంబంధించిన ఇతర వ్యక్తులు కూడా ఉన్నారు. దీని తర్వాత సిరాజ్, జనైల‌పై డేటింగ్ పుకార్లు వచ్చాయి. అయితే వారిద్దరూ సోషల్ మీడియా ద్వారా ఒకరికొకరు అన్నచెల్లెల‌ సంబంధాన్ని ధృవీకరించారు. ఇప్పుడు మహీరాపై పుకార్లు వ‌స్తున్నాయి. మహీరా సోషల్ మీడియాలో సిరాజ్ పేరుపై అభిమానులు చాలా కామెంట్స్ చేశారు. అయితే ఈ డేటింగ్‌ విషయాన్ని సిరాజ్ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. మహిరా ఓ ప్రముఖ టీవీ నటి. నాగిన్, కుండలీ భాగ్యలాంటి సీరియల్స్‌లో యాక్టింగ్ చేసింది. ఇక బిగ్ బాస్ 13లో ఫైనలిస్టుగా కూడా పేరు సంపాదించింది.

సిరాజ్- మహీరా మొదటిసారి ఎప్పుడు కలుసుకున్నారు?

మహీరా చాలా టీవీ షోలలో కనిపించింది.బిగ్ బాస్ 13లో క‌నిపించింది. సిరాజ్- మహీరా ఒకరికొకరు ఎలా పరిచయమయ్యారనే దానిపై ఇంకా సమాచారం రాలేదు. కానీ నివేదికల ప్రకారం.. వారిద్దరూ నవంబర్ 2024 నుండి ఒకరికొకరు తెలుసని స‌మాచారం. అయితే వారిద్ద‌రూ త‌మ డేటింగ్ విష‌యాన్ని చాలా ర‌హాస్యంగా ఉంచాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు నివేదిక‌లో పేర్కొన్నారు. ఇక‌పోతే సిరాజ్ ఇటీవ‌ల బోర్డ‌ర్‌- గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్ ప‌ర్య‌ట‌న‌లో టీమిండియా త‌ర‌పున ఆడాడు. ఆ సిరీస్ లో సిరాజ్ ఆశించిన మేర‌కు రాణించ‌లేక‌పోయాడు.