Mohammed Shami: ట్రోలర్స్ కు దిబ్బ తిరిగే కౌంటర్ ఇచ్చిన షమీ

ప్రపంచకప్ లో మహమ్మద్ షమీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కీలక సమయంలో కీలక వికెట్లు పడగొట్టి భారత్ ఫైనల్ కు చేరుకోవడంలో షమీ ముఖ్య పాత్ర పోషించాడు. నిజానికి శమికి మొదట తుది జట్టులో చోటు దక్కలేదు. అప్పుడు షమీని కన్సిడర్ చేయనూ లేదు.

Published By: HashtagU Telugu Desk
Mohammed Shami

Mohammed Shami

Mohammed Shami: ప్రపంచకప్ లో మహమ్మద్ షమీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కీలక సమయంలో కీలక వికెట్లు పడగొట్టి భారత్ ఫైనల్ కు చేరుకోవడంలో షమీ ముఖ్య పాత్ర పోషించాడు. నిజానికి శమికి మొదట తుది జట్టులో చోటు దక్కలేదు. అప్పుడు షమీని కన్సిడర్ చేయనూ లేదు. దీంతో మొదట నాలుగు మ్యాచుల్లో షమీ ఆడలేదు. ఆ తర్వాత 7 మ్యాచుల్లో అద్భుతంగా రాణించడంతో ప్రపంచకప్ సూపర్ హీరో అనిపించుకున్నాడు. ముఖ్యంగా శ్రీలంకపై షమీ హీరో పాత్ర పోషించాడని చెప్పాలి.

ప్రపంచకప్ లో 5.26 సగటుతో 24 వికెట్లు పడగొట్టిన షమీ శ్రీలంకపై మహమ్మద్ షమీ ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. ఆ సమయంలో భావోద్వేగానికి గురై మోకాళ్లపై కూర్చుని రెండు చేతులతో నేలను తాకాడు. అయితే దీన్ని కొందరు పాకిస్థానీలు వక్రీకరించారు. షమీ ప్రార్థన చేయాలనీ అలా కూర్చున్నాడు. అయితే ఎవరికో భయపడి షమీ మైదానంలో ప్రార్థన చేయలేదంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. దీంతో షమీ ఘాటుగా స్పందించాడు. గతంలో 5 వికెట్లు తీసినప్పుడు కూడా నేనెప్పుడూ మైదానంలో ప్రేయర్‌ చేయలేదని గుర్తు చేశాడు. కొంతమంది ట్రోలర్స్‌కు పనీపాటా అసలు ఉండదు.. ఏదో ఒకటి కాంట్రవర్శి చేయకపోతే ఉండలేరు. ఒకవేళ నేను నమాజ్‌ చేయాలనుకున్నా నన్ను ఆపేదెవరు?, నేను ముస్లింనని గర్వంగా చెప్పుకుంటాను. నేను నిజంగా మైదానంలో ప్రార్థన చేయాలనుకుంటే ఎవరూ అడ్డుకోలేరని కుండబద్దలు కొట్టాడు.ప్రస్తుతం షమీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ప్రస్తుతం భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. రెండు జట్ల మధ్య 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ లు జరగనున్నాయి. టీ20 సిరీస్‌లో 2 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇందులో భారత్ 0-1తో వెనుకంజలో ఉంది. ఆఫ్రికన్ టూర్‌లో టెస్టు సిరీస్ ఆడాలని షమీ భావిస్తున్నాడు. అయితే ఇందుకు ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సి ఉంది.

Also Read: BMW India: కార్ల వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. జనవరి నుంచి పెరగనున్న బీఎండబ్ల్యూ కార్ల ధరలు?

  Last Updated: 14 Dec 2023, 03:40 PM IST